‘మిస్టర్ బీన్’ యాక్సిడెంట్..లేటెస్ట్ ఇన్పో
పిల్లా పెద్దా తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని నవ్వుల్లో ముంచెత్తే మిస్టర్ బీన్ (రోవన్ అట్కిన్సన్)రీసెంట్ గా ఓ ప్రమాదకరమైన యాక్సిడెంట్ కు గురి కాబోయి తప్పించుకున్న సంగతి తెలిసిందే. మొన్న గురువారం జరిగిన ఈ యాక్సిడెంట్ వార్త అతని అభిమానలను తీవ్రంగా కలవరపరిచింది. ఎక్కడెక్కడి అభిమానులు ఫోన్స్ ద్వారా, ఫాక్స్ ల ద్వారా, కొంత మంది స్వయంగా ఆయన్ను చూడటానికి హాస్పటిల్ కి చేరుకున్నారు.విపరీతమైన వేగం అంటే గంటకు సుమారు 400 కి.మీ లతో ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతంలోని కేంబ్రిడ్జ్‌షైర్ ప్రాంతంలో స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
అయితే అదృష్టం బాగుండి చివరి నిముషంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కారు గిరికీలు కొట్టి, రోడ్డు పక్కనున్న ఒక చెట్టును ఢీకొని నుజ్జునుజ్జయి ఆగిపోయింది. గాయాలతో ఉన్న ఆయనని అదే దారిన వెళ్తున్న ఒక వ్యక్తి ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారం అందించడంతో, వారు రోవన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. భుజం ఎముక విరగడంతో ఆయనకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరిపారు. రోవన్‌కు యాక్సిడెంట్లు చేయడం కొత్తకాదని తెలుస్తోంది. ఆయన్ని ఈ రోజు డిచ్చార్జ్ చేసి ఇంటి వద్ద కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని వైద్యులు చెప్పి పంపించారు.


Click it and Unblock the Notifications











