ప్రియాంక, దీపిక అడుగుజాడల్లో అలియా భట్.. హాలీవుడ్‌పై దృష్టిపెట్టిన RRR హీరోయిన్

Recommended Video

Alia Bhatt Stated That She Hopes To Go To Hollywood someday Soon ! || Filmibeat Telugu

బాలీవుడ్‌లో అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న అలియా భట్ వరుసగా భారీ చిత్రాలతో దూసుకెళ్తున్నది. రానున్న రోజుల్లో క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు. ఇలా వరుస సక్సెస్‌లతో స్పీడ్ పెంచిన అలియా హాలీవుడ్‌పై దృష్టిపెట్టినట్టు వార్తలు బాలీవుడ్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అందుకు సంబంధించిన సాంకేతాలను కూడా అలియా ఇచ్చేశారు. అలియా భట్ ఏమన్నారంటే..

 పవర్ ఫుల్ పాత్రలో అలియా

పవర్ ఫుల్ పాత్రలో అలియా

రాజీ సినిమా తర్వాత అలియాభట్ ప్రతిభ ఎల్లలు దాటింది. ప్రస్తుతం త్వరలో కళంక్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. భారీ బడ్జెట్, వరుణ్ ధావన్, అదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ లాంటి తారాగణంతో రూపొందిన ఈ చిత్రంలో అలియాభట్ మరో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

RRR చిత్రంతో దక్షిణాదిలోకి

RRR చిత్రంతో దక్షిణాదిలోకి

ఇదే జోష్‌తో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే సినిమాలో సల్మాన్ ఖాన్‌తో జతకడుతున్నది. అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించే RRR చిత్రంలో కూడా రాంచరణ్ సరసన నటించే అవకాశం దక్కించుకొన్నది. ఇలా భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో నటిస్తున్న అలియాకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.

 హాలీవుడ్ పరిశ్రమ వైపు దృష్టి

హాలీవుడ్ పరిశ్రమ వైపు దృష్టి

ఒకవేళ అలియా భట్ హలీవుడ్ వైపు చూస్తే.. ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్ తర్వా మరో తార అడుగుపెట్టినట్టవుతుంది. ఇప్పటికే ప్రియాంక, దీపికా తమ మార్కును ప్రదర్శించారు. ప్రియాంక వరుస ప్రాజెక్టులతో తనదైన శైలిలో రాణిస్తున్నది. ఇక దీపికా పదుకోన్ హాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉంటున్నది.

నా టాలెంట్‌కు పదును పెడుతున్నా

నా టాలెంట్‌కు పదును పెడుతున్నా

ఇటీవల హాలీవుడ్ రంగ ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మంచి అవకాశం ఎదురుచూస్తున్నాను. ఏదో ఒక రోజు హాలీవుడ్‌లో అడుగుపెట్టక తప్పదేమో అనిపిస్తున్నది. కొత్త ప్రపంచంలో కాలు పెట్టడం అంత సులువు కాదు. ఇంకా నా టాలెంట్‌కు మరింత పదును పెట్టాల్సి ఉంటుందేమో అని అలియాభట్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X