బాక్సాఫీసు వద్ద సంచలన రికార్డ్: వరల్‌వైడ్ కలెక్షన్ రూ. 7.7 వేల కోట్లు!
వార్నర్ బ్రదర్స్ వారి 'ఆక్వామ్యాన్' డిసి కామిక్స్ క్యారెక్టర్స్ ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ 'ది డార్క్ నైట్ రైజెస్' సినిమా పేరు మీద ఉండగా తాజాగా 1.090 బిలియన్ డాలర్స్ వసూలు చేయడం ద్వారా ఆ రికార్డ్ బద్దలు కొట్టింది. అంటే మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 7700 కోట్లు.
క్రిస్టోఫర్ నోలన్స్ 'ది డార్క్ నైట్ రైజెస్' గతంలో 1.085 బిలియన్ డాలర్స్ వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన డిసి ఫిల్మ్‌గా నిలిచింది. అయితే ఆ రికార్డును ఇపుడు 'ఆక్వామ్యాన్' తుడిపుట్టేసింది.

వరల్డ్ వైడ్ 7వ స్థానంలో
అయితే అమెరికా బాక్సాఫీసు వద్ద మాత్రం ‘ఆక్వామ్యాన్'... ది డార్క్ నైట్ రైజెస్, ది డార్క్ నైట్ చిత్రాలకంటే వెనకబడే ఉంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే బిగ్గెస్ట్ సూపర్ హీరో చిత్రాల లిస్టులో 7వ స్థానంలో ఉంది.

బడ్జెట్ ఎంత పెట్టారు?
‘ఆక్వామ్యాన్' చిత్రాన్ని రూ. 1150 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రముఖ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసింది. బడ్జెట్‌కు 7 రెట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

త్వరలో సీక్వెల్
‘ఆక్వామ్యాన్' చిత్రానికి జేమ్స్ వాన్ దర్శకత్వం దర్శకత్వం వహించారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా వాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా అందించిన విజయంతో ఆక్వామ్యాన్ సీక్వెల్స్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆక్వామ్యాన్
జేసన్ మమోవా, అంబర్ హియర్డ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగులో సముద్రపుత్రుడు పేరుతో ఎన్.వి.ఆర్.సినిమా బ్యానర్‌పై ఎన్.వి.ప్రసాద్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సైతం ఈ సూపర్ హీరో ఫిల్మ్ మంచి వసూళ్లు సాధించింది.


Click it and Unblock the Notifications











