పిల్లలు కావాలని అడిగితే.. విడాకులు ఇచ్చింది..!
కమెడియన్ రస్సెల్ బ్రాండ్, తన భార్య సింగర్ క్యాటీ పెర్రీ నుండి విడాకులు కోరుతూ కోర్టుని ఆశ్రయించినట్లు సమాచారం. ఇంతకీ రస్సెల్ బ్రాండ్, క్యాటీ పెర్రీ నుండి విడాకులు కోరడానికి గల కారణం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. రస్సెల్ బ్రాండ్‌కి పిల్లలంటే చచ్చేంత ఇష్టం అంట. తన భార్యతో మనం ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాం అని కోరగా, అందుకు క్యాటీ పెర్రీ అంగీకరించ లేదు. దీనికి గాను రస్సెల్ బ్రాండ్, భార్య నుండి విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడు.
రస్సెల్ బ్రాండ్, క్యాటీ పెర్రీ ఇద్దరూ ప్రేమించుకోని 2010లో అంగరంగ వైభవంగా ఇండియాలో వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి జరిగి కనీసం 14నెలలు కాక ముందే డిసెంబర్ 30, 2011న తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంలో రస్సెల్ మాట్లాడుతూ పెర్రీ, పెళ్లి బాంధవ్యం గురించి సరిగా అర్దం చేసుకున్నట్లు లేదని అన్నాడు. ఎప్పుడూ తన కెరియర్, సింగింగ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్లి విషయంలో మేమిద్దరం తొందరపడి నిర్ణయం తీసుకొవడం జరిగింది.
పెర్రితో ఫ్యామిలీని ప్రారంభించాలని నేను ఎంతగానో ప్రయత్నించాను. ఈ విషయంపై ఈ వారంలో పెర్రీకి చాలా ఫోన్ కాల్స్ చేశాను. ప్రస్తుతం పెర్రీ వయసు 27 సంవత్సరాలు. ఇటీవలే ఇయర్ లాంగ్ టూర్‌ని పూర్తి చేసి మంచి గుర్తింపుని కూడా తెచ్చుకుందని అన్నాడు.


Click it and Unblock the Notifications











