అంతరిక్షంలో సినీ స్టూడియో.. రష్యా సూపర్ ప్లాన్.. యాక్టర్లను పంపేందుకు చర్యలు! మూవీ పేరు ఏమిటంటే!
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అంతరిక్షంపై వచ్చిన సినిమాలు చూసి కొత్త అనుభూతికి లోనయ్యారు. అయితే ఇక ముందు అంతరిక్షంలోకి వెళ్లి సినిమాలు రూపొందించే ప్రయత్నాలు మొదలయ్యాయి. రష్యా ఉప ప్రధాని చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తే అంతరిక్షంలో ఏకంగా మూవీ స్టూడియో ఏర్పాటు కల సాకారమయ్యేందుకు ఇంకా ఎంతో దూరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రష్యా ఉప ప్రధాని సంచలన ప్రకటన
అంతరిక్షంలో సినిమా షూట్ గురించి గతనెల రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా యూరీ మీడియాతో మాట్లాడుతూ.. ది ఛాలెంజ్ పేరుతో అంతరిక్షంలో రూపొందే చిత్రానికి ప్రైవేట్ వ్యక్తులు ఫండింగ్ చేయడానికి ముందుకు వస్తున్నారు అంటూ వెల్లడించారు.

అంతరిక్షంలో స్టూడియో
అంతరిక్షంలో స్టూడియో ఏర్పాటు, సినిమా షూటింగుల గురించి మీకు స్పష్టమైన గ్యారెంటీని ఇస్తున్నాను. నా హోదాలో నేను తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాను. అంతరిక్షంలో సినిమాను తీసే విషయంలో నా అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను అని యూరి బోరిసోవ్ తెలిపారు.

నటీనటుల ఖర్చులను భరించే
అంతరిక్షంలో నటీనటులు ఉండేందుకు, వసతి, ఇతర ఖర్చులను భరించేందుకు స్పాన్సర్లు ముందుకు రావాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పరిశోధనలో నేను జోక్యం చేసుకోను. కాకపోతే నా విజన్‌ను వర్కవుట్ చేయడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అని బోరిసోవ్ పేర్కొన్నారు.

రాస్కోమాస్ విస్తృత ప్రయత్నాలు
అంతరిక్షంలో షూటింగుకు అనువుగా ఆర్బిటల్ స్టేషన్‌లో సెట్ ఏర్పాటుకు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కోమాస్ విస్తృతంగా ప్రయత్నాలు చేపడుతున్నది. అంతరిక్ష వ్యోమగామిగా మారేందుకు, మానసికంగా, శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించే కథానాయిక కోసం వెతుకుతున్నాం. త్వరలోనే హీరోయిన్ ఎంపిక పూర్తి అవుతుంది అని తెలిపారు.


Click it and Unblock the Notifications











