ఆ సినిమాలో నేను వేసిన జాకెట్ సూపర్బ్‌గా ఉంటుంది
హాలీవుడ్ స్టార్ హీరో రేయన్ గోస్లింగ్ ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌కిచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ తను ఎల్లప్పుడూ కూడా కొత్త జాకెట్స్‌ని కొనడానికి ఇష్టపడుతానని అన్నారు. నేను ఎప్పుడూ జాకెట్స్ లోనే ఉంటాను. జాకెట్స్ ధరించడం అంటే నాకు చాలా ఇష్టం. నా ఇంట్లో ప్రపంచంలో లభించే అన్ని రకాల జాకెట్స్ ఉన్నాయి. డ్రైవ్ సినిమాలో నేను ధరించే జాకెట్స్ యూత్‌ని బాగా ఆకర్షిస్తాయి. 1950లో కొరియన్ సావనీర్ జాకెట్స్‌ని చూసి ఇష్టపడి మరీ నేను ఈ జాకెట్స్‌ని నేను డ్రైవ్ సినిమాలో ధరించడం జరిగింది.
డ్రైవ్‌లో నేను ధరించిన జాకెట్ తెలుపు రంగులో ఉండి, దాని వెనుక భాగాన ఓ తేలుని కలిగి ఉంటుంది. మీరు గనుక సినిమాని చూసినట్లేతే ఇట్టే మీకు తెలిసిపోతుందన్నారు. జాకెట్స్‌తో పాటు నాకు కారు నడపడం అంటే ఇంకా ఇష్టం. లాస్ ఏంజిల్స్ మాహా నగరంలో రాత్రి వేళల్లో నాకారు నడుపుతుంటే నాకు ఏదో తెలియని అనుభూతిని కలగజేస్తుందన్నారు. నా కారు(చెవర్లెట్ మాలిబు) అంటే ప్రాణం అని అన్నారు.
ఇక రేయన్ గోస్లింగ్ హీరో ప్రదాన పాత్రలో త్వరలో విడుదలవుతున్న సినిమా 'ద ప్లేస్ బియాండ్ ద పైన్స్', ఈ సినిమాలో ఇవా మెండిస్ అతని భార్యగా నటిస్తున్నారు. ఇద్దరు స్టార్స్‌లకు సంబంధించిన కొన్ని సీన్లను న్యూయార్క్‌లో తీయడం జరుగుతుంది. ఈ సినిమాలో ఇవా మెండిస్ మాస్ హీరోయిన్‌గా అభిమానుల మనసు దోచుకుంటారని సినిమాని తీస్తున్న డైరెక్టర్ డెరిక్ కెయిన్ ఫ్రాన్స్ వెల్లడించారు.
ఇక సినిమా హీరో రేయన్ గోస్లంగ్ విషయానికి వస్తే తనో మోటార్ సైక్లిలిస్ట్‌గా తన భార్య, పిల్లలను రక్షించుకనే క్రమంలో సాగుతుందని తెలిపారు. రేయన్ గోస్లంగ్ ఈ సినిమాలో స్లీవ్ లెస్ టీషర్ట్‌లు, ఒంటి నిండా టాటూలు వేసుకొని, బ్లీట్-బ్లండీ జుట్టుతో కుర్రకారు హృదయాలను ఇట్టే ఆకట్టుకుంటారనే వెల్లడించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం యాక్షన్ సీన్లతో రూపోందించడం జరుగుతుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











