అలనాటి క్లాసికల్ మూవీ రీమేక్‌కు సిద్దమైంది..!
లండన్, జూన్ 29: పాత సినిమాలు అలనాటి తీపి గుర్తులు. ఆ తీపి గుర్తులను సరైన విధానంలో తీస్తే మంచి సక్సెస్‌ను, సరిగా తీయలేని పక్షంలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు చెబుతున్నానంటే 1986లో హాలీవుడ్‌లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్నినమోదు చేసిన "హైల్యాండర్" త్వరలో రీమేక్ చేయనున్నారు. ఈ "హైల్యాండర్" రీమేక్‌లో స్టార్ హీరో రేయాన్ రేనాల్డ్స్ నటించడానికి తన అంగీకారాన్ని తెలిపాడు.
వివరాల్లోకి వెళితే కెనడియన్ స్టారైన రేయన్ రేనాల్డ్స్ ఈ క్లాసిన్ సినిమా కొత్త వర్సన్‌లో మఖ్య పాత్రైన 'స్కాట్స్మాన్ కానర్ మ్యాక్ లీడ్'ను పోషించనున్నారు. 1986లో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ రూపొందించిన ఈ సినిమాకు దర్శకత్వం రస్సెల్ ముల్కీ వహించగా... క్రిస్టోఫర్ లాంబర్ట్‌గా కార్నర్, విల్లా లూబ్స్ రామిజెసీన్‌గా సీన్ కానరీ నటించారు. ఆరోజుల్లో ఈ సినిమా విడుదలై బాక్సా ఫీసు రికార్డుల్ని సృష్టించింది.
స్కేర్ లెట్ జాన్సన్, రేయన్ రేనాల్డ్స్ మూడు సంవత్సరాల పాటు కలసి జీవించిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇటీవలే జులైలో విడాకులు తీసుకున్నారు. ఇప్పడు గతంలో వీరిద్దరూ కలిసి జీవించిన లాస్ ఏంజిల్స్ ఇంటిని మార్కెట్లో వేలంపాటలో పెట్టారు. ప్రస్తుతం రేయన్ రేనాల్డ్స్ ప్రస్తుతం గాసిప్ గర్ల్ స్టార్ బ్లేక్ లైవిలీతో కలసి జీవిస్తున్నాడు. ఇటీవలే బ్లేక్ లైవిలీ న్యూయార్క్‌లో $2 మిలియన్లు పెట్టి ఇంటిని కోనుగోలు చేసింది. స్కేర్ లెట్ జాన్సన్ కూడా సీన్ పెన్‌తో ధృడమైన బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ.. ఒంటరి గానే జీవిస్తుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











