భార్యను వదిలేసి వేరే భామతే డేటింగ్ చేస్తున్న హీరో
పోయిన సంవత్సరం తన భార్య స్కేర్ లెట్ జాన్సన్ నుండి విడిపోయిన తర్వాత హీరో రేయన్ రేనాల్డ్స్ కొత్తగా ఛార్లీన్ ధెరాన్‌తో డేటింగ్ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఇప్పటి వరకు కూడా ఛార్లీన్ ధెరాన్, రేయన రేనాల్డ్స్ పబ్లిక్‌గా కనిపించక పోవడం విశేషం. వీరిద్దరిని చూసిన వారు అందించిన వార్తల కధనం ప్రకారం జూన్ 5 ఉదయం పూట మోటర్ సైకిల్ మీద రేయన్ రేనాల్ట్స్ ఛార్లీన్ ధెరాన్ ఇంటికి వెళ్లి మద్యాన్నం మూడు వరకు అక్కడే ఆమెతోనే గడిపాడని అంటున్నారు.
వీరిద్దరూ గత ఐదు నెలలుగా డేటింగ్ చేసుకుంటున్నారని అక్కడున్న వారు వెల్లడించారు. ఇలా ఒక ప్రక్క ఛార్లిన్ ధెరాన్‌తో డేటింగ్ వ్వవహారం నడిపిస్తున్నప్పటికీ తన మాజీ భార్య స్కేర్ లెట్ జాన్సన్‌తో మాత్రం పూర్తిగా సంబంధాలను తెంచుకోలేదని అంటున్నారు. స్కేర్ లెట్ జాన్సన్, రేయన్ రేనాల్డ్స్ ఇద్దరు కూడా రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక సంవత్సరం పాటు కలిసున్న తర్వాత కొన్ని కారణాల వల్ల తన భార్య నుండి విడిపోవడం జరిగింది.
34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రేయన్ రేనాల్డ్స్ పోయిన వారం ఐరన్ మ్యాన్ 2 హీరోయిన్ జేనిత్ పాల్ట్రోతో లాస్ ఏంజిల్స్ లోని లిటిల్ డామ్స్‌లో కలసి డిన్నర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలసి జేనిత్ పాల్ట్రో ఇంటికి వెళ్లినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











