twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather మూవీకి ఆస్కార్ నిరాకరణ.. వివాదానికి తెరలేపిన నటి సాచీన్ కన్నుమూత!

    |

    హాలీవుడ్‌లో స్థానిక అమెరికన్లకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆస్కార్ అవార్డును తిరస్కరించిన సాచీన్ లిటిల్ ఫిదర్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె మరణించారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. ఆమె మృతితో సినీ ప్రపంచం, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అయితే గాడ్‌ఫాదర్ సినిమాలో అత్యుత్తమ నటనను ప్రదర్శించిన మార్లోన్ బ్రాండో తరఫున ఆస్కార్ అవార్డును అందుకొనేందుకు వేదికపైకి వెళ్లి అవార్డును తిరస్కరించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆమె మరణం, వివాదాస్పద ఆస్కార్ తిరస్కరణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

     క్యాన్సర్ వ్యాధితో మృతి

    క్యాన్సర్ వ్యాధితో మృతి

    సాచీన్ లిటిల్ ఫీదర్ గత నాలుగేళ్ల క్రితం అంటే మార్చి 2018వ తేదీన నాలుగో స్టేజ్ క్యాన్సర్ వ్యాధికి గురైనట్టు వైద్యులు ధృవీకరించారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతూ జీవనపోరాటం చేశారు. ఆదివారం రాత్రి నార్తర్న్ కాలిఫోర్నియాలోని నావాటో పట్టణంలోని తన నివాసంలో మరణించారని ఆమె సంరక్షుడు మీడియాకు అధికారికంగా వెల్లడించారు. ఆమె మరణంతో స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

    మార్లోన్ బ్రాండో తరఫున ఆస్కార్ నిరాకరణ

    మార్లోన్ బ్రాండో తరఫున ఆస్కార్ నిరాకరణ

    ఆస్కార్ అవార్డును సాచీన్ తిరస్కరించడంతో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఈ వివాదానికి వివరణ ఇస్తూ.. హాలీవుడ్ చిత్రాల్లో అమెరికన్లను చూపిసున్న విధానం సరిగా లేదు. అందుకు నిరసనగా నటుడు మార్లోన్ బ్రాండో ఆస్కార్ అవార్డును తిరస్కరిస్తున్నారు. ఆయన అవార్డును తీసుకోవడం లేదని సుదీర్గమైన లేఖను పంపించారు. కానీ దానిని సమయాభావం వల్ల చదువలేకపోతున్నాను. ముఖ్యంగా ప్రధాన అంశాలు చెప్పి.. నిష్క్రమిస్తాను అని అన్నారు.

    హాలీవుడ్‌లో అమెరికన్ల చిన్నచూపు

    హాలీవుడ్‌లో అమెరికన్ల చిన్నచూపు

    హాలీవుడ్‌లో అమెరికన్లు చిన్నచూపు చూడటమనే అంశం కాకుండా.. అమెరికన్ ఇండియన్ మూవ్‌మెంట్‌ (AIM)లో భాగంగా సౌత్ డకోటా పట్టణంలో అమెరికా మార్షల్స్, ఇతర ఫెడరల్ ఏజెంట్లు 200 మందిపై దాడి చేయడం.. ఆ ఘటనలో మోకాలి గాయాలకు గురై వారు తీవ్ర వేధనలో ఉన్నారు. ఆ దాడి ఘటనపై తాము నిరసన వ్యక్తం చేస్తూ ఆస్కార్ అవార్డును తిరస్కరిస్తున్నాం అని పురస్కార వేదికపై సాచీన్ లిటిల్ ఫీదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

     అపాచీ డ్రస్‌లో వచ్చి..

    అపాచీ డ్రస్‌లో వచ్చి..

    మార్చి 1973లో జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ప్రముఖ నటులు లివ్ ఉల్లమాన్, రోజర్ మూర్ ఈ సంచలన సంఘటనకు సాక్ష్యంగా నిలిచారు. అపాచీ డ్రెస్‌లో వేదికపైకి వచ్చిన ఆమె అవార్డును అందించబోగా సున్నితంగా నిరాకరించారు. అవార్డు ఇవ్వాలనే మీ నిజాయితీ, ఉదారతకు ధన్యవాదాలు. మీ అందించే అవార్డును అందుకోలేకపోతున్నందుకు మన్నించాలి అని సాచీన్ లిటిల్ ఫీదర్ చెప్పారు. మార్లోన్ బ్రాండో పంపిన 8 పేజీల లేఖను మీడియాకు అందించారు.

    సాచిన్ లిటిల్‌ఫీదర్ సినిమా కెరీర్..

    సాచీన్ లిటిల్ ఫీదర్ కెరీర్ విషయానికి వస్తే. 1973లో కౌన్సెలర్ ఎట్ క్రైమ్ మూవీ ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత లాఫింగ్ పోలీస్‌మెన్, ఫ్రీబీ అండ్ ది బీన్, ది ట్రయల్ ఆఫ బిల్లి జాక్ లాంటి చిత్రాల్లో నటించారు. ఆమె చివరి సారిగా 2018లో సాచీన్: ది బ్రేకింగ్ సైలెన్స్ అనే షార్ట్ ఫిలింలో నటించారు. తన జీవితాతం స్థానిక అమెరికన్స్ పౌర హక్కుల కోసం పోరాడారు.

    English summary
    Sacheen Littlefeather passed away. Sacheen Littlefeather was an Indigenous activist who famously rejected the Oscar for Best Actor in 1973on behalf of Marlon Brando in protest against the mistreatment of Indigenous Peoples in Hollywood & to bring attention to the Wounded Knee Occupation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X