twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొడుకుని కొల్పోతే తండ్రిగా ఎక్కువ బాధ అనుభవిస్తున్నా: సిల్వెస్టార్ స్టాలన్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టార్ స్టాలన్ తన కుమారుడు సేజ్ మరణం అనంతరం మాట్లాడుతూ తనకి, తన మాజీ భార్య సాషా జాక్‌కి యూనివర్స్ అని అన్నాడు. మా తదుపరి జీవితాలు వాడిని కోల్పోయిన బాధతో జీవిస్తాం. సిల్వెస్టార్ స్టాలన్, 36 సంవత్సరాల వయసు కలిగిన కుమారుడు సేజ్ జులై 13వ తారీఖున లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంట్లో శవమై కనిపించాడు.

    సేజ్‌ని కోల్పోవడం నాకు జీవితంలో వాటిల్లిన అతి పెద్ద నష్టం. ఈ నష్టంతో మా మిగిలిన జీవితాలు పోవాలని రాసి పెట్టి ఉంది. సాషా జాక్, నాకు కలిగిన మొదటి సంతానం సేజ్. మా ఇద్దరికి వాడు సెంటర్ ఆఫ్ యూనివర్స్. నా కొడుకు ఆత్మకు శాంతిని ప్రసాదించమని నేను ఆ దేవుడుని యాచిస్తున్నాను. సిల్వెస్టర్, సేజ్ వైపు ప్రేమ మరియు గౌరవం చూపించాలని ప్రజలు అభ్యర్థించాడు.

    కుమారుడుని ఓ తండ్రి కొల్పోయినప్పడు ఎక్కువ బాధ అనిపిస్తుంది. అందువలన నా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిభావంతుడైన నా కొడుకు కోసం మరియు అతని తల్లి సాషా జాక్ ప్రేమాభిమానాలు అతనిపై ఉండాలని కోరుకుంటూ అతనిని గౌరవిద్దాం అని అన్నాడు. ఇది ఒక భయంకరమైన విషాదమని, అతను చాలా చిన్నతనంలోనే చనిపోవడం బాధాకరమని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ కామండర్ ఆండ్రూ స్మిత్ తన సానుభూతిని తెలియజేశారు.

    పోలీసులకు అందించిన రిపోర్ట్స్ ప్రకారం సేజ్ ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్లనే చనిపోయాడని ఆండ్రూ తెలిపారు. ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ర్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వచ్చిందని పోలీసు నిపుణులు రిపోర్ట్స్ ఆధారంగా చెప్పారు. తన తండ్రి సిల్వెస్టర్ స్టాలన్‌కు హాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన రాకీ V, సినిమాలో రాకీ కుమారుడు రాబర్ట్ బాల్బోగా సేజ్ నటించాడు. ఈ సినిమా 1990లో విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Actor Sylvester Stallone says his son Sage was the centre of his and ex-wife Sasha Czack’s universe and the loss will be felt for the rest of their lives.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X