ఆమెతో సెక్స్ చేయమన్నాడు.. చంపుతానన్నాడు.. లైంగికంగా వేధించాడు.. దర్శకుడిపై హీరోయిన్ ఫైర్

By Rajababu

Recommended Video

మరో మహిళతో సెక్స్ చేయమన్నాడు..! | Filmibeat Telugu

హాలీవుడ్ దర్శకుడు తనను లైంగికంగా దారుణంగా వేధించాడని అందాల తార సల్మా హయక్ సంచలన ప్రకటన చేసింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడని, ఓ దశలో తనను చంపుతానని ఆయన బెదిరించాడని సల్మా దర్శకుడి బాగోతాన్ని బయటపెట్టింది. అలాంటి కీచక దర్శకుడు ఎవరో కాదు హర్వీ వెయిన్‌స్టెయిన్. ఇప్పటికే ఆయనపై ఎందరో హాలీవుడ్ హీరోయిన్లు తమను వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సల్మా బయటపెట్టిన విషయాలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి.

 హార్వే మానవ మృగం

హార్వే మానవ మృగం

ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హయక్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఓ కాలం రాశారు. ఆ వ్యాసంలో హర్వేని ఓ మానవమృగం లాంటి వాడు అని ఆమె పేర్కొన్నాడు. తన కెరీర్ తొలి నాళ్లలో ఎలా వేధించుకు తిన్నాడో వివరంగా, పూసగుచ్చినట్టుగా వెల్లడించింది.

 ఫ్రైడా చిత్రంలో హర్వేతో

ఫ్రైడా చిత్రంలో హర్వేతో

2002లో ఫ్రైడా అనే చిత్రం కోసం హార్వేతో సల్మా హయక్ పనిచేసింది. ఈ చిత్రం ఫ్రైడా కాహ్లో అనే పెయింటర్ జీవితం ఆధారంగా రూపొందింది. ఆ చిత్రంలో సల్మా నటించడమే కాకుండా, సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో హర్వే చాలా తెలివైన వాడు. మంచి స్నేహితుడిగా ఉండేవాడు. కుటుంబ విలువలు కూడా తెలిసిన వాడు కూడా అని సల్మా చెప్పింది.

 లైంగికంగా వేధనలు

లైంగికంగా వేధనలు

ఎప్పుడూ హర్వేతో కలిసి పనిచేయాలని ఉండేది. కాని కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఆయనతో పనిచేయాలంటేనే ఓ కాళరాత్రిగా మారేది. నోటికి చెప్పలేనంతగా తన కోరికలతో వేధించేవాడు. దాంతో అతడితో కలిసి పనిచేయవద్దని నిర్ణయం తీసుకొన్నాను అని సల్మా పేర్కొన్నారు.

 శారీరక సుఖం కోసం

శారీరక సుఖం కోసం

హర్వే వెయిన్‌స్టెయిన్‌ ప్రవర్తన ఎంత దారుణమంటే.. ఎప్పుడూ శారీరక సుఖం కోసం వేధించేవాడు. హోటల్, షూటింగ్ లొకేషన్, ఎక్కడ ఉన్నామనే ధ్యాస ఉండకుండా వేధించేవాడు. అతని సినిమాలో నటించకున్నా నాకు ఈ బాధలు తప్పేవి కాదు. అతని దారుణాలు ఎలా ఉండేవంటే.. తనతో స్నానం చేయమని బలవంతం పెట్టేవాడు. లేదా నేను స్నానం చేస్తుంటే చూస్తానని వేధించేవాడు అని తన వ్యాసంలో వెల్లడించింది.

ఓరల్ సెక్స్ కోసం వేధింపులు

ఓరల్ సెక్స్ కోసం వేధింపులు

ఇక నగ్నంగా మసాజ్ చేస్తానని, లేదా తన స్నేహితుడితో మసాజ్ చేయించుకోమని పోరుపెట్టేవాడు. ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేసేవాడు. నగ్నంగా ఉన్న మరో మహిళతో పడుకోమనే వాడు అని సల్మా హయక్ పేర్కొన్నది. ఓ దశలో నన్ను చంపుతానని బెదిరించాడు. తనను ఎవరూ ఏమి చేయలేరని విర్రవీగేవాడు అని చెప్పింది.

 మహిళతో సెక్స్ చేయమని

మహిళతో సెక్స్ చేయమని

ఓ షూటింగ్ సందర్భంగా మరో మహిళతో సెక్స్ చేస్తున్నట్టు నటించమని బలవంతం చేశాడు. అర్ధనగ్నంగా, అసభ్యంగా, అశ్లీలంగా నటించాలని సూచించేవాడు. ఓ దశలో ఆ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను అని కూడా సల్మా వెల్లడించింది. తనతో చేసుకొన్న సినిమా ఒప్పందం కారణంగా నగ్నంగా నటించడానికి సిద్ధపడ్డాను. ఓ మహిళతో నగ్నంగా నటించడానికి హర్వే కోసం రెడీ అయ్యాను.

 భయంతో వణికిపోయాను.. ఏడ్చాను..

భయంతో వణికిపోయాను.. ఏడ్చాను..

మరోసారి సెక్స్ సీన్‌లో నటించమని అడిగినప్పుడు బాధతో ఏడ్చాను. భయంతో వణికిపోయాను. వాంతులు కూడా అయ్యాయి. అయినా హర్వే వదిలిపెట్టలేదు. అలాంటి బాధలు అనుభవించాల్సి రావడం జీవితంలో చేసుకొన్న దురదృష్టం అని సల్మా బాధపడింది.

 ఆరోపణలు తప్పు

ఆరోపణలు తప్పు

తనపై సల్మా చేసిన ఆరోపణలను హర్వే తోసిపుచ్చాడు. అమెరికాలోని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మరో మహిళతో సెక్స్ సీన్ చిత్రీకరించింది నిజమే. కానీ ఆ షూటింగ్ సమయంలో నేను అక్కడ లేను అని హర్వే వెల్లడించారు.

 కథ డిమాండ్ మేరకే

కథ డిమాండ్ మేరకే

ఫ్రైడా చిత్రంలో కథను బట్టి అలాంటి సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది. ఫ్రైడా కాహ్లో బై సెక్సువల్. ఆ కారణంగానే సెక్స్ సీన్లను కథ డిమాండ్ చేసింది. ఆ మేరకే అలాంటి సీన్లను చిత్రీకరించాను అని హ్వార్వే చెప్పాడు.

 హార్వేపై లైంగిక ఆరోపణలు

హార్వేపై లైంగిక ఆరోపణలు

గత కొద్ది నెలలుగా హర్వేపై పలువురు హాలీవుడ్ తారలు అనేక ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమను లైంగికంగా వేధించేవాడు. తమపై అత్యాచారం కూడా జరిపారని పలువురు మహిళలు అతడి తీరును బయటపెట్టారు. తాజా ప్రముఖ నటి సల్మా హయక్ కూడా ఆరోపణలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X