twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సినిమాకు అతనే ఖచ్చితమైన దర్శకుడు..

    By Nageswara Rao
    |

    జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాదు జేమ్స్ చేసే సాహాసాలు చూడాలని ప్రతి ఒక్కరూ కూడా ఊవిళ్లుఊరుతుంటారు. అలాంటి అభిమానుల కొసం త్వరలో స్క్రీన్ మీదకి డేనియల్ గ్రెగ్ జెమ్స్ బాండ్‌గా 'బాండ్ 23' అనే సినిమా రాబోతుంది. బాండ్ 23 అనే జేమ్స్ బాండ్ సినిమాకి దర్శకత్వం టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ భర్త శ్యామ్ మెండిస్ వహిస్తున్నారు. గతంలో శ్యామ్ మెండిస్ అమెరికన్ బ్యూటీ, అవే వుయ్ గో, ద కైట్ రన్నర్ లాంటి హాలీవుడ్ బాక్సాఫీసు రికార్డు సినిమాలను అందించారు.

    1999లో అమెరికా బ్యూటీ అనే సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డుని సొంతం చేసుకున్నారు. బాండ్ 23సినిమాలో జేమ్స్ బాండ్‌గా నటిస్తున్న డేనియల్ గ్రెగ్, శ్యామ్ మెండిస్ దర్శకత్వ పటిమను ఈ విధంగా తెలియజేస్తున్నారు. డేనియల్ గ్రెగ్ మాట్లాడుతూ బాండ్ 23 సినిమాకు గాను మేము చక్కని కధను తయారు చేయడం జరిగింది. గతంలో క్యాసినో రాయల్ కధ విన్నప్పుడు కంటే కూడా బాండ్ 23 కధ విన్నప్పుడు కొంత ఉద్వేగానికి లోను కావడం జరిగిందని అన్నారు.

    బాండ్ 23 కధను చక్కగా తెరమీద ఆవిష్కరించడానికి శ్యామ్ మెండిస్ ఖచ్చితమైన దర్శకుడిగా భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 2012లో బాండ్ 23ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని 43సంవత్సరాల వయసు కలిగిన డేనియల్ గ్రేగ్ తెలిపారు.

    English summary
    Actor Daniel Craig is excited about upcoming James Bond movie, tentatively titled “Bond 23″, and hails filmmaker Sam Mendes as “the perfect director” to tackle the blockbuster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X