'అవతార్' సీక్వెల్ కోసం సిద్ధం అవుతున్న హీరో..!!
గతంలో వున్న అన్ని రికార్డులనీ తుడిచిపెట్టేసి, విడుదలయిన కేవలం మూడు వారాల్లోనే బిలియన్ డాలర్లను వసూలు చేసి సరికత్త అధ్యాయాన్ని సృష్టించేదిశగా వెళ్తున్న సినిమా అవతార్. టైటానిక్ వంటి అద్భుత ప్రేమకథను తెరకెక్కించిన జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జ్యాక్ సుల్లీ గా శ్యామ్ వర్తింగ్టన్ అద్భుత నటనను ప్రదర్శించాడు. ఈ సినిమాలో ఆయన స్టార్ హీరో అయిపోయాడు.
కాగా ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ ను రూపొందించనున్నట్టు దర్శకుడు కామెరూన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవతార్ సినిమా విడుదలకు ముందే ఆయన ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో వున్నట్టు తెలియజేసారు. ఇక రాబోయే సీక్వెల్ పాండోరా లో కాకుండా మరో గ్రహంలో జరిగే కథతో సినిమాను రూపొందించనున్నట్టు కామెరూన్ తెలిపారు. ఈ సీక్వెల్ కోసం గ్రహాన్ని మార్చినా హీరో జ్యాక్ సుల్లీ పాత్రకు మాత్రం అవతార్ లో తన అద్భుత నటనతో అలరించిన శ్యామ్ వర్తింగ్టన్ నే ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ వార్త విన్న శ్యామ్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మరి అవతార్ లో అద్భుతంగా నటించిన నెయిత్రి పాత్రకు ఎవరిని ఎన్నుకోనున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్..!!


Click it and Unblock the Notifications











