నిజమయిన 'అవతారు'లు వీరే...!!
ఇప్పుడు హాలీవుడ్ లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అవతార్. ఇందులో జాక్ గా నటించిన కథానాయకుడు శ్యామ్ వర్తింగ్టన్ నావీ గా బ్రీడ్ చెయ్యబడిన అవతార్ గా కొద్ది సేపు, పాండోరా గ్రహానికి వచ్చిన మాజీ నావీ సైనికుడిగా కొద్ది సేపు కనిపించాడు. ఇందులో అతని నటన అద్భుతంగా వుందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇందులో శ్యామ్ తో పాటు అతనికి ధీటుగా ఆడ నావీ నెయిత్రి గా నటించిన జో సాల్దనా మాత్రం సినిమా మొత్తం నావీగా నీలంగు చర్మంలో, 10 అడుగుల ఎత్తుతో కనిపించింది. మరి ఈవిడ గారి నిజమయిన అవతారం లో ఎలా వుంటుందో అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొని వుంది. ఇప్పటికే చాలా మంది ఆమె నిజరూపాన్ని చూసేసి వుంటారు. కానీ ఇంత వరకూ ఆమెను చూడని వారి కోసమే మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం.
మీరు అక్కడి చిత్రంలో జాక్ గా నటించిన శ్యామ్ వర్తింగ్టన్ ప్రక్కన నిలబడి చిరునవ్వులు చిందిస్తున్న నల్ల కలువ జో సాల్దనా నే మీరు చూసిన అవతార్ సినిమాలో ఎన్నో సాహసాలు చేసిన నెయిత్రి. ఇంతకు ముందు జో "పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పెర్ల్", "స్టార్ ట్రెక్" అనే సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాగా సినిమాలో నావీలు గా కనిపించిన వీరిద్దరూ గత బుధవారం నాడు హాలీవుడ్ లో జరిగిన అవతార్ ప్రీమియర్ షోలో ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఫోటాలకు ఫోజులు ఇచ్చారు. కాగా గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విలుదలయిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ గత ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 232.18 మిలియన్ డాలర్లను వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. భారతదేశంలో కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ హాలీవుడ్ సినిమా తొలి రోజే 6.75 కోట్లరూపాయలను వసూలు చేసి సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఏంటీ మీరింకా ఈ సినిమా చూడలేదా..?? అయితే వెంటనే వెళ్లి చూడండి. ఈ సాంకేతిక అద్భుతాన్ని మిస్ అవకండి. వీలయితే 3-డి థియేటర్లో చూడండి.


Click it and Unblock the Notifications











