డేటింగ్ మత్తులో మునిగి తేలుతున్న జంట..!
డచ్ సూపర్ మోడల్ సాందర్ కోక్ మరియు కోర్ట్ని లవ్ ఇద్దరూ ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నట్లు హాలీవుడ్ లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ మాన్ హాట్టన్ లో నైట్ షాప్ ఓపెనింగ్ కి రావడం జరగింది. దానితో తోలిచూపులోనే ప్రేమ పుట్టినటువంటి సాందర్ కోక్, కోర్ట్ని లవ్ కి చాలా పెద్ద ప్యాన్ అవ్వడం జరిగింది. అప్పటినుండి వీరిద్దరి మధ్య పుట్టినటువంటి ప్రేమ అలా అలా చిగురించి మొత్తానికి డేటింగ్ వరకు దారి తీసింది. దానితో వీరికి ప్రతిరోజూ వసంత రాత్రి లాగా ఎంజాయ్ చేస్తున్నారని హాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ విషయం పై ఇటీవల సూపర్ మోడల్ సాందర్ కోక్ దగ్గర ప్రస్తావించగా తను మాత్రం తనకు ఏమి తెలియదన్నట్లు కోర్ట్ని లవ్ నేను మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అంతేకాకుండా నాకు హాలెండ్ లో మంచి అందగతైన గర్ల్ ప్రేండ్ ఉందని అన్నారు. దీనతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. హాలెండ్ లో గర్లప్రేండ్ ఉన్నంత మాత్రాన న్యూయర్క్ లో ఇంకోక అమ్మాయిని చూడకూడదని రూలు ఏమైనా ఉందా అని అక్కడ ఉన్న వారు అనుకున్నారు.


Click it and Unblock the Notifications











