2009 వ సంవత్సరానికి అపర కుబేరులు వీరే...!!
2009వ సంవత్సరం మనందరికీ వీడ్కోలు పలుకుతూ వెళ్లిపోయింది. 2010వ సంవత్సరం హాయ్ అంటూ పలకరించింది. మరి గడచిపోయిన ఏడాదిని ఒక్కసారి పరికించి చూస్తే, గత ఏడాది అత్యధిక ఆదాయాన్ని పొందినది ఎవరని ఆరా తీస్తే ఆమె సాండ్రా బుల్లక్ అని తేలింది. హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న జానీ డెప్ ను సైతం వెనక్కునెట్టి ఈమె ఈ ఘనతను సాధించింది.
గత ఏడాది 'ది ప్రపోజల్', 'ది బ్లైండ్ సైడ్' వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె 1999వ సంవత్సరం తరువాత అత్యధిక ఆదాయం పొందిన జాబితాలో తొలి స్థానం లో నిలిచిన యువతి కావడం విశేషం. ఇంతకు ముందు 1999లో జూలియా రాబర్ట్స్ ఈ ఘనతను సాధించింది. ఆ తర్వత రెండవ స్థానంలో జానీ డెప్ నిలిచాడు.
2009వ సంవత్సరానికి కాను అత్యధిక ఆదాయం పొందిన టాప్-10 సెలబ్రిటీల వివరాలు ఇలా వున్నాయి.
1. సాండ్రా బుల్లక్
2. జానీ డెప్
3. మట్ దామన్
4. జార్జి క్లూనీ
5. రాబర్ట్ డౌనీ
6. టామ్ హ్యాంక్స్
7. మెర్లి స్ట్రీప్
8. బ్రాడ్ పిట్
9. షియా
10. డ్యాంజెల్ వాషింగ్టన్


Click it and Unblock the Notifications











