వాళ్శ నాన్న శవం తాలుకా గది తాళం దొరికిందా....?
ఇద్దరూ ఇద్దరే ఇదేదో మణిరత్నం సినిమా పేరు అనుకుంటున్నారా..కాదండీ నేను చెప్పబోయే ఆ ఇద్దరూ సాంద్రా బుల్లక్ మరియు టామ్ హాంక్స్. ఈ ఇద్దరూ కలసి ఒక సినిమాలో నటించబోతున్నారు. ఆ సినిమా పేరు 'ఎక్స్ ట్రీమ్ లీ లౌడ్ అండ్ ఇన్ క్రెడిబ్లిలీ క్లోజ్'. జనాతన్ సాప్రన్ రచించిన ఎడాప్సన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు స్టీపెన్ దాడ్లీ మాట్లాడుతూ వీళ్శిద్దరూ కలసి నా సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది.
సాంద్రా బుల్లక్ ని గురించి మాట్లాడాలంటే సాంద్రా బుల్లక్ 'ది బ్లైండ్ సైడ్'అనే చిత్రానికి గాను ఆస్కార్ అందుకున్నారు. సాంద్రా బుల్లక్ అమెరికా రెడ్ క్రాస్ సోసైటీ కీ రెండు సార్లు 1 మిలియన్ డాలర్ల ను విరాళంగా యిచ్చారు. ఇలా చారిటీ కార్యక్రమాలలో పాల్గోనడం వల్ల ఆమె సేవా కార్యక్రమాల పట్ల తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే టామ్ హాంక్స్ ఒకప్పుడు హాలీవుడ్ అందగాడు. అలాంటి టామ్ హాంక్స్ హీరో గానే కాకుండా రచయిత, నిర్మాతగా కూడా తన సత్తాని చాటుకున్నాడు. ఇంకేముంది అలాంటి టామ్ హాంక్స్ ని ఆస్కార్ వరించకుండా వుంటుందా. టామ్ హాంక్స్ కూడా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 9/11 న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన టెర్రరిస్టుల ఎటాక్ గురించి.ఈ టెర్రరిస్టుల ఎటాక్ లో వాళ్శ నాన్న చనిపోతారు. ఈ సినిమాలో 9 సంవత్సరాల వయసుగల బాలుడు చనిపోయిన వాళ్శ నాన్న శవం తాలుకా గదికి సరిపోయే తాళం గురించి, ఈ బాలుడు చివరకి దానిని ఎలా సంపాదించాడు అనేది సారాంశం. ఈ సినిమా అంతా ఉత్కంఠతో సాగూతుందని దర్శకుడు స్టీపెన్ దాడ్లీ అన్నారు. ఈ సినిమా లో ఈ బాలుడు తల్లి దండ్రులుగా సాంద్రా బుల్లక్, టామ్ హాంక్స్ నటించనున్నారు.


Click it and Unblock the Notifications











