ఎలిన్ గోర్డాన్ అనుసరిస్తున్న సాంద్రా బుల్లక్.....!
న్బీసి మార్నంగ్ షో కి మార్నింగ్ ఇంటర్యూ ఇవ్వడానికి వచ్చిన సాంద్రా బుల్లక్ ప్రముఖ హాలీవుడ్ నటి ఆస్కార్ అవార్డు పొందిన సాంద్రా బుల్లక్ తన భర్త జెస్సీ జేమ్స్ ను క్షమించడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. సాంద్రా తనకు ఆస్కార్ తెచ్చిపెట్టిని సినిమా ది బ్లైండ్ సైడ్ సినిమా షూటింగ్ లో బిజీగా వుండగా ఇక్కడ ఈయన రాసలీలల్లో మునిగితేలాడు. ఏకంగా ముగ్గురు యువతులతో కులికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఈ ఆస్కార్ అవార్డు నటీమణి అతన్ని వదిలి హాలీవుడ్ కొండల్లోని తన ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఇతగాడు ఎలాగయినా సాంద్రా బుల్లక్ ను తిరిగి తనదానిని చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట.
ఆమెకు తను మారిపోయానని తెలపడానికి మానసికచికిత్సా కేంద్రానికి వెళ్లినట్టు నటించిన అతను ఆమె అతని కాల్స్ రిసీవ్ చేసుకోకపోవడంతో అక్కడి నుండీ బయటకు వచ్చేసి తిరిగి ఏ పథకంతో ఆమెను బుట్టలో పడేయాలా అని ఆలోచిస్తున్నాడట. కానీ సాంద్రా మాత్రం అతన్ని తిరిగి తన భర్తగా ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని విడాకులకు సమాయత్తం అవుతోందట.
ఇలాంటి సమయంలో తనకి ఇటీవల తన భర్త నుండి విడాకులు తీసుకున్న ఎలిన్ గోర్డాన్ అనుసరించాలని అనుకుంటుందంట. జెస్సీ జేమ్స్ లాగే టైగర్ వుడ్స్ కూడా రాసలీలలు నడపడం వల్ల ఎలిన్ గోర్డాన్ తన భర్త తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల వీళ్శిద్దరుకు కోర్టు విడాకులు మంజూరు చేయడం జరిగినది. దీనికిగాను టైగర్ వుడ్స్, ఎలిన్ గోర్డాన్ కు రూ 464 కోట్లు చెల్లించడం జరిగినది.
ఇది తెలిసిన సాంద్రా బుల్లక్ ఈ పద్దతి ఎదో బాగుంది అనుకున్నదేమో, విడాకులు తో పాటుగా డబ్బు కూడా వస్తుంది కదా. మనం కూడా ఇలా చేద్దాం అని అంటుంది. సాంద్రా బుల్లక్ ప్లాను ఫలించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











