ఓ పెద్ద హీరో గోకుడు భరించలేకపోయా... శారీరకంగా హింసించాడు.. ప్రముఖ హీరోయిన్
లైంగిక వేధింపులపై కొనసాగుతున్న మీ టూ ఉద్యమం చల్లారుతున్నదనుకొనే లోపే హాలీవుడ్ నటి సారా జెస్సికా పార్కర్ ఓ పెద్ద హీరోపై సంచలన ఆరోపణలు చేశారు. తనతో ఓ బడా హీరో అసభ్యంగా ప్రవర్తించారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. సెక్స్ అండ్ ది సిటీ అనే చిత్రంలో సారా జెస్సికా మంచి ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్న సంగతి తెలిసిందే. సారా జెస్సికా ఆరోపణలు ప్రస్తుతం హాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. సారా చేసిన ఆరోపణలు ఏమిటంటే..

ప్రారంభంలో నిలదొక్కుకునేందుకు
నా కెరీర్ ఆరంభంలో నిలదొక్కుకోవడానికి కష్టాలు పడుతున్న సమయం అది. ఆ సమయంలో బిగ్ మూవీ స్టార్ నాతో అసభ్యంగా వ్యవహరించాడు. మాటలతో చెప్పలేని విధంగా నాతో వ్యవహరించారు. ఆ సమయంలో కెరీర్ ఏమౌతుందనే భయంతో నోరు విప్పలేదు అని సారా జెస్సికా అన్నారు. నా ప్రొఫెషనల్ జీవితం గురించి ఆలోచించడం వల్లే నేను బయటకు చెప్పుకోలేకపోయాను అని ఆమె పేర్కొన్నారు.

ఆధునిక భావాలు ఉన్నప్పటికీ..
ఆధునిక భావాలు ఉన్న మహిళను అయినప్పటికీ నేను ఆ హీరో చేసిన వేధింపులు తట్టుకోలేకపోయాను. నేను నటించే పాత్ర మంచిదైనప్పటికీ నేను ఆ సినిమా నుంచి బయటకు వెళ్లిపోదామా అనే ఫీలింగ్ కలిగింది. దాంతో ఆయనపై ఉన్న గౌరవం ఒక్కసారిగా కుప్పకూలింది. నేను బలహీనురాలిని కాబట్టే నేను ఏం చేయలేకపోయాను అని సారా ఆవేదన వ్యక్తం చేశారు.

చాలాకాలం ఆ హీరో వేధింపులతో
హాలీవుడ్‌లో ప్రముఖ హీరో అయిన ఆయన వేధింపులు చాలా కాలం కొనసాగాయి. చాలాసార్లు వెంటపడి నాపై శారీరకంగా వేధించాడు. అప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితి ఏమిటో అర్ధకాకుండా ఉండేది. ఎక్కువ కాలం ఆ పరిస్థితిని భరించలేక చివరకు నా మేనేజర్‌తో ఈ విషయాన్ని పంచుకొన్నాను. దాంతో పరిస్థితిలో అనూహ్యమైన మార్పు కనిపించింది. నా మేనేజర్ తీసుకొన్న చర్యలు నాకు ఉపశమనం కలిగించాయి అని సారా జెస్సికా పేర్కొన్నారు.

నా మేనేజర్‌కు చెప్పడంతో కాస్త..
నేను నా మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంపై సదరు బడా హీరో మండిపడ్డారు. నా అంతు చూస్తానని బెదిరించాడు. నగరం నుంచి బయటకు పంపిస్తానని హెచ్చరించాడు. వన్ వే టికెట్ పంపిస్తాను.. మూట ముళ్లే సర్దుకో అని చెప్పారు. ఇక పరిశ్రమలో కనిపించకుండా చేస్తాను అని అని సారా జెస్సికా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

మీటూ ఉద్యమం కారణంగానే
మీటూ ఉద్యమం బలంగా ఉందనే కారణంతో తాను ఇప్పుడు ఈ విషయాలు చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆ హీరో పేరు బయటకు చెప్పడ నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆయన పేరు చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం కూడా లేదన్నారు. హాలీవుడ్‌లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సారా జెస్పికా పార్కర్ 1997లో వివాహం చేసుకొన్నారు. ఆమె వివాహం నటుడు మ్యాథ్యూ బ్రాడెరిక్‌తో జరిగింది. డైవోర్స్, తదితర చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.


Click it and Unblock the Notifications











