ముందు సేవింగ్స్, ఆ తర్వాతే ఫ్యామిలీ: మేఘన్
హాలీవుడ్ అందాల నటి మరియు మోడల్ మేఘన్ ఫాక్స్ తన ప్యూచర్‌ని భద్రంగా చూసుకునేందుకు తగినంత డబ్బు సంపాదించిన తర్వాతనే పిల్లలు, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తానని అన్నారు. ఈ సందర్బంలో మేఘన్ ఫాక్స్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు. నాకు పిల్లలు అంటే ప్రాణం. నాకు పిల్లలను కనాలని ఆశ ఉంది. వీటితో పాటు ప్రస్తుతం నా మైండ్‌లో ఒక నెంబర్‌ని ఫిక్స్ చేసుకున్నాను. ఆ నెంబర్‌ని ఫిక్స్ చేయడానికి కారణం నేను అనుకున్న నెంబర్ డబ్బుని సంపాదించిన తర్వాతనే పిల్లలను కంటాను. ఆ డబ్బుతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెంచుతాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
25సంవత్సరాల వయసు కలిగిన మేఘన్ ఫాక్స్‌కు ఎఫ్ హెచ్‌ఎమ్ మ్యాగజైన్ ప్రపంచం మొత్తం ఉన్న అందగత్తెలలో సెక్సీయస్ట్ ఉమెన్‌గా అభివర్ణించడం జరిగింది. ఐతే ఇటువంటి కాంప్లిమెంట్స్ సాధారణంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని అన్నారు. తనకు మాత్రం తను ఏమంత పెద్ద అందగత్తెగా కనిపించనని తెలియజేశారు. దీనికి గల కారణాలను కూడా మేఘన్ ఫాక్స్ తెలిపారు.
తను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక్కసారి కూడా అందమైన అమ్మాయి అవార్డుని అందుకోలేదని అన్నారు. నా జుట్టు కలర్ ఎప్పుడూ కూడా ఆరంజ్ కలర్‌లోనే ఉంటుంది. అదే విధంగా నేను పెద్ద పాపులర్ గర్ల్‌ని కూడా కాదన్నారు. నేను ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉండేదానినని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఇది ఇలా ఉంటే 2004లో బ్రైన్ ఆస్టన్ గ్రీన్ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టి జూన్ 2010లో పెళ్సి చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా మేగన్ ఫాక్స్‌ని అభిమానులు అందరూ ముద్దుగా జూనియర్ ఏంజిలీనా జోలీగా అభివర్ణిస్తారు. 25 సంవత్సరాల వయసు కలిగిన మేగన్ ఫాక్స్ తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మార్లిన్ మన్రో ఫోటోని తన కుడి చేతిపై టాటూగా వేయించుకోవడం జరిగింది. ఐతే ఇప్పుడు మేగన్ ఫాక్స్ తన కుడి చేతిపై ఉన్న మార్లిన్ మన్రో టాటూని తీసివేయించుకోవాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. దీనికి గల కారణం తన శరీరంపై ఉన్న మార్లిన్ మన్రో టాటూ వల్ల నెగిటివ్ ఎనర్జీని సొంతం చేసుకొవాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకొవడం జరిగిందని మేగన్ ఫాక్స్ తెలిపింది.


Click it and Unblock the Notifications











