twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శరీరం గురించి ఆందోళన చెందుతున్న స్టార్ హీరోయిన్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్ తన శరీరంలో వచ్చిన మార్పులకు సంతోషించాలో లేక బాధపడాలో తెలియడం లేదని చెప్తుంది. త్వరలో స్కేర్ లెట్ జాన్సన్ లీడ్ హీరోయిన్ పాత్రలో నటించిన 'అవెంజర్స్ అసెంబుల్' చిత్రంలో తాను బ్లాక్ విడోగా నటిస్తున్నానని.. ఈ పాత్ర కోసం తన జీవితంలో జిమ్ కెళ్లని స్కేర్ లెట్ జాన్సన్ జిమ్‌కి వెళ్లి మంచి బాడీ షేప్‌ని తీసుకొచ్చారు.

    ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్యూలో స్కేర్ లెట్ జాన్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడవారికి వారి శరీరంలో మార్పులు వస్తే బాధగానే ఉంటుంది. దానికి నేను ఏమీ ప్రత్యేకం కాదు. ఐతే ఈ పాత్ర కోసం ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతున్నానని అన్నారు.

    సూపర్ హీరో చిత్రమైన 'అవెంజర్స్ అసెంబుల్' స్కేర్ లెట్ జాన్సన్ గూఢచారి పాత్ర చాలా భయంకరమైనదిగా ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో స్కేర్ లెట్ జాన్సన్ అందంతో పాటు ఆమె చేసిన పోరాటం దృశ్యాలు అభిమానులకు నచ్చుతాయని అన్నారు. పోరాట దృష్యాలను బ్రహ్మాండంగా తీసేందుకు గాను స్కేర్ లెట్ జాన్సన్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ హైదీ మనీమేకర్‌తో కలసి పని చేసింది.

    హాలీవుడ్ స్టంట్ మాస్టర్ హైదీ మనీమేకర్‌ గురించి ప్రస్తావిస్తూ మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడం వల్ల కొన్ని స్టంట్స్ అన్ని కూడా అధ్బుతంగా వచ్చాయి. మేము తీసుకున్న శిక్షణ, అంకితం భావం చూస్తే బాధిస్తుంది. పోరాట సన్నివేశాలు కాస్త బాధించినప్పటికీ.. సరైన సన్నివేసాల్ని పొందే వరకు ఎంత బాధనైనా భరించి చక్కగా చేశామని అన్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు జాస్ వెడాన్ దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ, క్రిస్ ఎవాన్స్, మార్క్ రుఫ్పెలో, క్రిస్ హెమ్స్ వర్త్, జెరెమీ రేన్నెర్, సామ్యుఎల్ జాక్సన్ తదితరులు ముఖ్య తారాగణం.

    English summary
    Actress Scarlett Johansson says she is as worried about her body as any other woman. But she is glad that her action role in “Avengers Assemble” as Black Widow got her into the best shape she has ever been in.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X