అతనితో డేటింగ్ చేస్తున్నానని రాసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా
హాలీవుడ్ అందగత్తెలలో ఒకరైనటువంటి స్కేర్‌లెట్ జాన్సన్ తన భర్త రేయన్ రేనాల్డ్స్ నుండి గత సంవత్సరం డిసెంబర్‌లో విడిపోయిన తర్వాత హాలీవుడ్ సూపర స్టార్ సీన్ పెన్ తో డేటింగ్ చేస్తున్నారంటూ వచ్చినటువంటి వార్తలను స్కేర్‌లెట్ జాన్సన్ ఖండించడం జరిగింది. ఈసందర్బంలో స్కేర్‌లెట్ జాన్సన్ మాట్లాడుతూ రేయన్ రేనాల్డ్స్ నుండి విడిపోవడానికి కారణం అతని పద్దతులు నచ్చకనే అని అన్నారు. అందుకే మేమిద్దరం కోర్టు ద్వారా విడిపోవాలని డైవర్స్‌కి కూడా అప్లే చేయడం జరిగింది.
అటు తర్వాత అమెరికా వీక్లీ మ్యాగజైన్ నేను జనవరి నుండి సీన్ పెన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రాయడం మొదలు పెట్టాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో రెండవ సారి లాస్ ఏంజిల్స్ లో కలిశామని వార్తలు ప్రచురించాయి. దీనికిగాను నేను మీఅందిరికి సమాధానం చెప్తున్నాను. నాకు సీన్ పెన్‌కి మద్య ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి వార్తులు ఈసారి నా పరిమిషన్ లేకుండా రాసినట్లైతే నేను వారిపై పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











