మూడో పెళ్లికి సిద్దమైన హాట్ హీరోయిన్.. రెండేళ్ల డేటింగ్‌కు బ్రేక్.. షాహీద్‌కు మరో షాక్

హాలీవుడ్ నటి, అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొన్న స్కార్లెట్ జాన్సన్ పెళ్లికూతురు కాబోతున్నది. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రముఖ హీరో కోలిన్ జాస్ట్‌తో ఈ భామ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కాలిన్ జాస్ట్ సాటర్‌డే నైట్ లైవ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడు. స్కార్లెట్ జాన్సన్ ఎంగేజ్‌మెంట్ వార్త హాలీవుడ్ మీడియాను కుదిపేసింది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వార్త మీడియాలో ప్రముఖంగా మారింది. వివరాల్లోకి వెళితే..

రెండేళ్లుగా హీరోతో డేటింగ్

రెండేళ్లుగా హీరోతో డేటింగ్

స్కార్లెట్ జాన్సన్, జాస్ట్ ఇద్దరూ 2017 నుంచి డేటింగ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఏదో రోజు వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమనే మాట వినిపించింది. తాజాగా ఎంగేజ్‌మెంట్‌తో ఆ వార్తలకు బ్రేక్ పడ్డాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఇటీవల స్కార్లెట్ జాన్సన్ నటించిన అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

 రెండు పెళ్లిళ్లు పెటాకులు

రెండు పెళ్లిళ్లు పెటాకులు

ఇక స్కార్లెట్ జాన్సన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. గతంలో రెండు పెళ్లి జరిగాయి. ర్యాన్ రెనాల్డ్స్‌తో వివాహం రెండేళ్లపాటు సాగింది. 2008లో పెళ్లి చేసుకొని 201లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత రొమేనియన్ డారియాక్‌ను 2014లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత 2017లో వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు తీసుకొన్నారు. కాగా జాస్ట్‌కు ఇది తొలి వివాహం కావడం గమనార్హం.

కోలిన్ జాస్ట్‌తో సన్నిహితంగా ఉంటూ

కోలిన్ జాస్ట్‌తో సన్నిహితంగా ఉంటూ

రొమేనియన్ డారియాక్‌‌ను విడిపోయిన తర్వాత కోలిన్ జాస్ట్‌తో సన్నిహితంగా మెలుగుతున్నది. డారియాక్‌తో ఆమెకు నాలుగేళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం తన పర్యవేక్షణలోనే కూతురు ఉంది. జాస్ట్‌తో పెళ్లికి ప్రస్తుతం ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు సమాచారం. తన పెళ్లి రూమర్లపై స్పందిస్తూ.. ఏది ఎప్పుడూ ఎలా జీవితంలో జరుగాలో అది అప్పుడే జరుగుతుంది అని అన్నారు.

అవెంజర్స్: ఎండ్‌గేమ్‌లో బ్లాక్ విడోగా

అవెంజర్స్: ఎండ్‌గేమ్‌లో బ్లాక్ విడోగా

ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా విడుదలైన అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రంలో బ్లాక్ విడో పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డుకు చేరువైంది.

 స్కార్లెట్ జాన్సన్

స్కార్లెట్ జాన్సన్

ఇది ఇలా ఉండగా.. స్కార్లెట్ జాన్సన్ అంటే సినీ హీరోలు పడిచస్తారు. ఆమె అందానికి పలువురు బాలీవుడ్ హీరోలు ఫిదా అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాహీద్ కపూర్ తనకు ఆమె అంటే ఎంత ఇష్టమో చెప్పారు. ఎవరికీ కనిపించకుండా ఉండే శక్తి వస్తే.. స్కార్లెట్ జాన్సన్ స్నానం చేసేటప్పుడు చూడాలని ఉంది అని షాహీద్ తన మనసులోని మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X