మోస్ట్ సెక్సీయెస్ట్ వుమెన్‌గా మళ్లీ ఆమెనే..
లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహన్సన్ ప్రపంచంలో అత్యంత శృంగారవంతమైన మహిళగా రెండోసారి ఎంపికయ్యారు. 28ఏళ్ల యువ నటి స్కార్లెట్ ఈ ఘనతను సాధించడం ద్వారా ఎస్క్వైర్ మేగజైన్ కవర్ పై రెండో సంవత్సరం కూడా తన చిత్రాన్ని ముద్రించుకుంది. స్కార్లెట్ జోహన్సన్ 2006లో మొదటిసారి ఈ టైటిల్‌ను దక్కించుకుంది.
ఈ సందర్భంగా స్కార్లెట్ జోహన్సన్ మాట్లాడుతూ... రెండు సార్లు ఈ టిటైల్‌ను గెలుచుకున్న యువతిని తనేనని అన్నారు. తనతో నిశ్చితార్థం చేసుకున్న మాజీ జర్నలిస్టు రోమైన్ డ్యూరిక్ ప్రస్తుతం తన అనుబంధాన్ని చూసి గర్వపడున్నట్లు ఆమె తెలిపింది.

ఇప్పటివరకు తనలో ఇంత జలసీ ఉందని తనకు కూడా తెలియని స్కార్లెట్ అన్నారు. డ్యూరిక్‌తో మాత్రమే తను డేటింగ్ చేస్తున్నట్లు ఆమె తలిపింది. అతన్ని ఇష్టపడటమే కాదు జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపింది. రియాన్ రేనాల్డ్స్‌తో స్కార్లెట్‌కు ఇంతకుముందు వివాహం కాగా అతనికి గుడ్ బై చెప్పి డ్యూరిక్‌తో డేట్ చేస్తోందీ సుందరి.
హాలీవుడ్ పరిశ్రమలో బాగా బిజీగా ఉన్న స్కార్లెట్ జోహన్సన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇంతకుముందు అనేక హిట్ చిత్రాల్లో స్కార్లెట్ నటించారు. మ్యాచ్ పాయింట్, ఐరన్ మ్యాన్ 2, ది అవెంజర్స్ లాంటి భారీ చిత్రాల్లో స్కార్లెట్ నటించారు. డాన్ జోన్ అనే కామెడీ పోర్న్ అడిక్షన్ సినిమాలో కూడా ఆమె నటించారు. ఇలాంటి చిత్రాలు మహిళల హోదాను తగ్గించేవి కాదని స్కార్లెట్ అభిప్రాయ పడింది.


Click it and Unblock the Notifications











