పారితోషకంలో రికార్డు సృష్టించిన సెక్సీ స్కేర్‌లెట్ జాన్సన్
లండన్, జులై 8: హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్‌లెట్ జాన్సన్‌కి "ఎవెంజర్స్ 2" సినిమాలో నటించినందుకు గాను 13 మిలియన్ పౌండ్లు రెమ్యూనరేషన్‌గా ఇచ్చారని నివేదిక ప్రకారం తెలిసింది. బహుశా ఇంత మొత్తం ఒక సినిమాకు ఒక నటికి ఇప్పటివరకు ఒక సినిమాలో చెల్లించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 27 సంవత్సరాల వయసు కలిగిన స్కేర్‌లెట్ జాన్సన్ సూపర్ హీరో సీక్వెలైన బ్లాక్ విడో పాత్రను పోషిస్తుంది.
ఇప్పటి వరకు 'ది టూరిస్ట్' అనే సినిమాకు గాను ఏంజిలీనా జోలీ 12.2 మిలియన్లను తీసుకున్నారు. ఐతే ఇప్పుడు అవెంజర్స్ 2 సినిమా ద్వారా ఇప్పుడు స్కేర్ లెట్ జాన్సన్ 13 మిలియన్లను తీసుకోని ఒక సినమాకు అత్యధిక పారితోషం తీసుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించనున్నారు. అవెంజర్స్ పార్ట్ 1 సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించి 936 పౌండ్లను వసూలు చేసింది. ఈ సినిమాలో బ్లాక్ విడోగా స్కేర్ లెట్ జాన్సన్ పోషించిన పాత్ర సినిమాకి హైలెట్ అవ్వడంతో అవెంజర్స్ 2లో స్కేర్‌లెట్ జాన్సన్‌ని నటించమని అడగడమే కాకుండా ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
2013లో ప్రారంభం కానున్న అవెంజర్స్ 2 సినిమాలో స్కేర్‌లెట్ తప్పక నటిస్తుందని సినిమా నిర్మాతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవెంజర్స్ సినిమాలో నటించిన రాబర్ట్ డౌనీ, క్రిస్ హెమ్స్ వర్త్, జెరమీ రెన్నర్‌ల పారితోషకాన్ని భారీగా పెంచారు. కథను దృష్టిలో పెట్టుకోని స్కేర్ లెజ్ జాన్సన్‌కి అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ తెలిపారు. అవెంజర్స్‌లో స్కేర్ లెట్ జాన్సన్ తన ఫిజిక్‌తో అభిమానుల మనసు దోచుకోవడంతో పాటు సాహాసోపేతమైన సన్నివేశాలలో నటించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











