twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జానెట్' పాత్రను పోషించడానికి సిద్దం: స్కేర్‌లెట్

    By Nageswara Rao
    |

    Scarlett Johansson
    హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్‌ 'ది మేకింగ్ ఆఫ్ సైకో' అనే సినిమాలో జానెట్ లై పాత్రను పోషించనుందని సమాచారం. 35 సంవత్సరాల వయసు కలిగిన స్కేర్ లెట్ జాన్సన్‌‌తో పాటు ఈ సినిమాలో జేమ్స్ ఆర్కే, ఆంటోనీ హాప్‌కిన్స్, డేమీ హెలెన్ మిర్రర్ తదితరులు నటిస్తున్నారు. గతంలో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన అన్వెల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సాచా జెర్వాసీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత స్కేర్ లెట్ జాన్సన్‌ 'వుయ్ బాట్ ఎ జూ' సినిమాలో నటించనున్నారు.

    స్కేర్ లెట్ జాన్సన్‌కి సంబంధించిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టి ఆమెని అల్లరి పాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని అమెరికన్ ఎఫ్‌బిఐలో రిపోర్ట్ చేయడంతో ఈ కేసుని వారు డీల్ చేయడం తెలిసిందే. బుధవారం 35 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టోఫర్ ఛాన్సీ అనే యువకుడిని ఎఫ్‌బిఐ అరెస్టు చేయడం జరిగింది. ఇతనిపై ఉన్న చేయబడ్డ ఆరోపణలు స్కేర్ లెట్ జాన్సన్‌తో పాటు, ప్రముఖ సెలబ్రిటీలకు మిలా కునిస్, జెస్సికా ఆల్బా, వానిసా హుడ్జెన్స్‌కు చెందిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయం జరిగింది.

    పోలీసులకు దొరికిపోయిన తర్వాత క్రిస్టోఫర్ ఛాన్సీ వారి సమక్షంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్దం అయింది. నా ద్వారా బాధింప బడ్డ వారికందరికి నేను క్షమాపణలను తెలియజేస్తున్నానని అన్నారు.

    English summary
    Actress Scarlett Johansson will play the role of Janet Leigh in “The Making of Psycho”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X