మణికట్టుపై 'టాటూ' న్యూయార్క్‌పై ప్రేమను తెలియిజేస్తుంది
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్ తన మణికట్టుపై 'ఐ లవ్ న్యూయార్క్' టాటూని వేయించుకున్న తీరుని సమర్దించుకున్నారు. స్కేర్ లెట్ జాన్సన్ కొత్తగా నటించిన యాక్షన్ సినిమా 'ది అవెంజర్స్' ప్రీమియర్ షో లండన్‌లో గత వారం జరిగింది. ఈ ప్రీమియర్ షోలో స్కేర్ లెట్ జాన్సన్ గర్వంగా తన మణికట్టుపై ఉన్న టాటూని ఫోటోగ్రాఫర్స్‌కి చూపుతూ ఫోజులిచ్చింది.
ఈ సందర్బంలో ఓ ఫోటోగ్రాఫర్ అడిగిన ప్రశ్నకు జాన్సన్ మాట్లాడుతూ నా కుడి మణికట్టు మీద ఉన్న టాటూ బ్రాస్లెట్ మాదిరి కనిపిస్తూ దాని నుండి ఒక సుత్తి-ఆకారంలో లాకెట్టులా చూసేందుకు చక్కగా కనిపిస్తుందని బదులిచ్చింది. స్కేర్ లెట్ జాన్సన్ న్యూయార్క్ సిటీలోనే పుట్టి పెరగడం వల్ల ఈ సిటీపై ఉన్న మమకారంతో ఈ టాటూని వేయించుకున్నానని అన్నారు.
'ది అవెంజర్స్' సినిమాలో ఫైటింగ్ సీన్స్ షూటింగ్ చాలా కష్టమనిపించిందని అన్నారు. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ రోజులు షూట్ చేయడంతో బహుశ నాకు ఇలా అనిపించి ఉండవచ్చునని అన్నారు. మొదటి రోజు కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. రెండవ రోజు నుండి చాలా ఛాలెంజింగ్ తీసుకోని ఈ సినిమాలో ఫైటింగ్ సీన్స్ లో నటించానని అన్నారు.
రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని మే 4వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని స్టాన్ లీ, జాక్ కిర్బీ వ్రాసిన నవల 'ది అవెంజర్స్' ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు జాస్ వెడాన్ దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ, క్రిస్ ఎవాన్స్, మార్క్ రుఫ్పెలో, క్రిస్ హెమ్స్ వర్త్, జెరెమీ రేన్నెర్, సామ్యుఎల్ జాక్సన్ తదితరులు ముఖ్య తారాగణం.


Click it and Unblock the Notifications











