మైండ్ బ్లోయింగ్.. ఒక్క సినిమా కోసం ఆ హీరోయిన్‌కి 110 కోట్ల రెమ్యునరేషన్.. బిగ్గెస్ట్ డీల్!
మార్వెల్ స్టూడియోస్ నిర్మించే సూపర్ హీరో చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ చిత్రాలు వేల కోట్లల్లో బిజినెస్ చేస్తుంటాయి. ఈ ఏడాది వచ్చిన మార్వెల్ సూపర్ హీరో చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అవెంజర్స్ సిరీస్, ఇతర మార్వెల్ చిత్రాలలో వరుసగా స్టార్ హీరోయిన్ స్కార్లెట్ జోహెన్సన్ నటిస్తూ వస్తోంది. ఆమె నటించిన బ్లాక్ విడో పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మర్వెల్ సంస్థ బ్లాక్ విడో పాత్రతోనే ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది.

సూపర్ హీరోలకు ధీటుగా
మార్వెల్ చిత్రాలలో సూపర్ హీరోలు అద్భుత విన్యాసాలతో ఆకట్టుకుంటారు. వారికీ ఏమాత్రం తగ్గకుండా స్కార్లెట్ కూడా బ్లాక్ విడో పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. తాజా స్కార్లెట్ ప్రధాన పాత్రలో మార్వెల్ సంస్థ ప్లాన్ చేసిన చిత్రానికి భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

110 కోట్ల పారితోషికం
ఈ చిత్రానికి గాను స్కార్లెట్ 110 కోట్ల భారీ పారితోషికాన్ని(15 మిలియన్ డాలర్లు) అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు మార్వెల్ సంస్థకు, స్కార్లెట్ కు మధ్య ఇటీవలే డీల్ కుదిరినట్లు హాలీవుడ్ మీడియా స్పష్టం చేస్తోంది. ఇటీవల కాలంలో ఇది బిగ్గెస్ట్ డీల్ గా హాలీవుడ్ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. ఇది సూపర్ హీరోలకు సమానమైన రెమ్యునరేషన్ కావడం విశేషం.

ఆమె పాత్రకు ఉన్న డిమాండ్
స్కార్లెట్ పాత్రకు ఉన్న డిమాండ్ దృష్ట్యా మార్వెల్ స్టూడియోస్ నిర్మాతలు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఐరన్ మాన్ చిత్రం కోసం రాబర్ట్ డౌనీ జూనియర్ కు ఇచ్చిన రెమ్యునరేషన్ 5 మిలియన్ డాలర్లు మాత్రమే. బ్లాక్ పాంథర్ చిత్రానికి చాడ్విక్ అందుకున్న రెమ్యునరేషన్ 2 మిలియన్ డాలర్లు మాత్రమే. కానీ ఇటీవల స్కార్లెట్ పోషించిన బ్లాక్ విడో పాత్ర బాగా జనాల్లోకి వెళ్ళింది.

సూపర్ హీరోయిన్
అవెంజర్స్ చిత్రాలతో సూపర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న స్కార్లెట్.. 110 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతూ నిజంగానే సూపర్ హీరోయిన్ అనిపించుకుంది. స్కార్లెట్ అందుకోబోతున్న భారీ రెమ్యునరేషన్ చూసి హాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.


Click it and Unblock the Notifications











