రొమాన్స్ చేయాలంటే సీక్రెట్ డేటింగ్స్ ఉంటేనే మజా..
యుఎస్‌ఎ ఎక్స్ ఫ్యాక్టర్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహారిస్తున్న నికోలే షెర్జింజర్, 33 సంవత్సరాల వయసు కలిగిన ఫార్ములా వన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తో రొమాన్స్ చేసేందుకు గాను సీక్రెట్‌గా కలుస్తున్నట్లు హాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే నాలుగు సంవత్సరాల నుండి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ అక్టోబర్‌లో బహిరంగంగా మీడియాకు దొరికిపోయారు.
దాంతో అందరికి తెలిసిపోయింది కదా అని అనుకున్నారో ఏమో గానీ, వీరిద్దరి రిలేషన్ షిప్ మరింత బలపరచుకునేందుకు గాను ఎక్కవ సమయం ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకొవడం జరిగిందని ఇటీవల ఫార్ములా వన్ సీజన్‌లో ఓ ప్రముఖ టివీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. ఈ సందర్బంలో హామిల్టన్ మాట్లాడుతూ ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా కలుసుకుంటూ ఎవరితోనైనై రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమని పేర్కోన్నాడు .
లాయిస్ ఫార్ములా వన్ రేసులలో వారానికి ఒక్కో దేశంలో గడుపుతూ ఉంటాడు. మేము ఎప్పుడైనా కలుసుకొవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు స్కైపీలో మాట్లాడుకొవడానికి ప్రయత్నిస్తామని నికోలే షెర్జింజర్ తెలిపింది. ప్రస్తుతం లాయిస్ 'ఎఫ్ 1' సిరిస్‌లో బిజీగా ఉన్నప్పటికీ నాతో గడపడానికి మాత్రం తగినంత సమయాన్ని కేటాయిస్తాడని, నాతో కలవలేకుండా తాను ఉండలేడని పేర్కోంది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే నికోలే షెర్జింజర్ 'కొత్త కాఫీ టేబుల్ బుక్'కి నగ్నంగా తన అందాలను ఆరబోసింది. ఇక వివరాల్లోకి వెళితే 33 సంవత్సరాలు వయసు కలిగిన పుస్సీ క్యాట్ డొల్స్ సింగర్ నికోలే షెర్జింజర్‌తో పాటు ప్రముఖ సింగర్స్ లేడిగాగా, ఐరినా షేక్ మొదలగున వారు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.


Click it and Unblock the Notifications











