విడిపోయినా.. పిల్లల కోసం కలసి పండుగ సెలబ్రేషన్స్
కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా ఎన్నికయిన హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తన భార్య మేరియా ష్రివర్ నుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే వీరిద్దరూ విడిపోయినప్పటికీ క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌ని మాత్రం కలసి జరుపుకున్నారు. ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఇరుగు పొరుగు వారు చెప్పిన దాని ప్రకారం క్రిస్ మస్ సెలబ్రేషన్స్‌ని ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తన భార్య మేరియా ష్రివర్‌తో పాటు, పిల్లలుతో సరదాగా కాలిఫోర్నియాలో ఉన్న తన సొంత ఇళ్లు 'బ్రెంట్‌వుడ్' లో ఎంజాయ్ చేస్తూ కనిపించారని తెలిపారు.
మద్యాన్నం సమయంలో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ కుటుంబ సమేతంగా లాస్ ఏంజిల్స్ స్టాపెల్స్ సెంటర్‌లో ఉన్న లేకర్స్ సీజన్ ఓపెనర్ గేమ్‌లో పాల్గోన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ జులైలో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ పుట్టిన రోజుకి కలిశారు. అసలు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తన భార్య నుండి విడాకులు తీసుకోవడానికి కారణం అక్రమ సంబంధమేనని అంటున్నారు. తన ఇంటిలో పనిచేసే ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ కండల ధీరుడు పదేళ్ల క్రితమే ఒక బిడ్డను కూడా కన్నాడని వార్తా సంస్థలు కొన్ని నెలల క్రితం బయటపెట్టాయి.
ష్వార్జ్ నెగ్గర్ నుంచి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న మేరియా పాతికేళ్లుగా భర్తతో కాపురం చేస్తోంది. మాజీ జర్నలిస్టు అయిన ఆమెకు నలుగురు పిల్లలు. అక్రమ సంబంధంతో తన భర్త ఓ బిడ్డకు జన్మనిచ్చాడని తెలిశాక మేరియా భర్త నుంచి విడిపోయి వేరే ఇంటిలో జీవనం సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పిల్లలో మైనారటీ తీరిన ఇద్దరు ఉమ్మడి సంరంక్షణలో ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు 'బీబీసీ' తెలిపింది. విడాకులకు సంబంధిచి దాఖలు చేసిన పిటీషన్లో ' పరిష్కిరించుకోవడానికి వీలుకాని విభేధాలు వలన' విడిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు మేరియా పేర్కొంది. తాము విడిపోయినప్పటికి మైనారిటీ తీరని తమ ఇద్దరు పత్రులు ఉమ్మడి సంరక్షణలో ఉండాలని మేరియా కోరింది.
2003 కాలీఫోర్నియా రాష్ట్రగవర్నర్‌గా రిపబ్లికన్ పార్టీ తరుపున పోటి చేసి గెలిచిన ష్వార్జ్ నెగ్గర్, గత జనవరిలో తన పదవికి రాజీనామా చేశాడు. సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


Click it and Unblock the Notifications











