5 ఆస్కార్ అవార్డులను గెలిచిన అనోరా.. దర్శకుడికే 3 పురస్కరాలు
ఆస్కార్ 2025 అవార్డులు కార్యక్రమంగా కన్నుల పండువగా ముగిసింది. సింగర్స్ సింతియా ఎరివో, ఆరియానా గ్రాండే ఆస్కార్ వేడుకలను ఘనంగా ఆరంభించారు. సమ్‌వేర్ ఓవర్ ది రెయిన్‌బో అనే పాటను ఆలపించి ఆస్కార్ అవార్డుల ప్రదానానికి తెర లేపారు. ప్రముఖ నటి స్కార్లెట్ జాన్సన్ ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. ఆమె రెడ్ కార్పెట్‌పైకి వచ్చి అందరికి అభివాదం చేస్తూ ఆకట్టుకొన్నారు. ఈ అవార్డులో అనోరా మూవీకి అవార్డుల పంట పండింది. ఇంకా ఈ అవార్డుల విశేషాలు, ఇతర వివరాల్లోకి వెళితే..
ఆస్కార్ 2025 వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై ప్రముఖ నటి ఎమ్మా స్టోన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. రెడ్ కార్పెట్‌పైకి రాగానే అందరి కళ్లు ఆమెపైనే దృష్టిని కేంద్రీకరించాయి. ఆమె కనిపించగానే మీడియా వర్గాల్లో చిన్న అలజడి కనిపించింది. ఇక ది బ్రూటలిస్ట్ ఫేమ్ ఫెలిసిటీ జోన్స్ తన అంద చందాలతో ఆస్కార్ రెడ్ కార్పెట్‌ను వేడెక్కించింది. ఆమె రెడ్ కార్పెట్ అడుగుపెట్టగానే మీడియా కెమెరాలన్నీ ఆమె గ్లామరస్ లుక్‌ను బందించేందుకు పోటీపడ్డాయి.

తారల తళుకుబెళుకల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో అనోరా చిత్రం ఐదు అవార్డులను గెలుచుకొన్నది. ఈ చిత్రం బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, విభాగంలో సీన్ బేకర్‌కు అవార్డు దక్కింది. ఇంకా బెస్ట్ ఎడిటింగ్, సీన్ బేకర్, బెస్ట్ డైరెక్టర్‌గా సీన్ బేకర్ తన సత్తాను చాటారు. అలాగే అనోరా చిత్రంలో అద్బుతమైన ప్రతిభను చాటిన మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకొన్నది. అలాగే ఉత్తమ చిత్రంగా అనోరా నిలిచింది.
ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో దర్శకుడు సీన్ బేకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా తాను దర్శకత్వం వహించిన సినిమాకు ఐదు అవార్డులు వచ్చే విధంగా కృషి చేశాడు. ఈ ఘనతను సాధించిన ఆయనను సినీ ప్రముఖుల, ప్రపంచ సినిమా అభినందనలతో ముంచెత్తుతున్నది.


Click it and Unblock the Notifications











