ముప్పయి సంవత్సరాల ఇండస్ట్రీ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఆయనకే..
హాలీవుడ్ లోతనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు సీన్ పెన్. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గాకూడా తన సత్తా చాటారు. 2003లో సంవత్సరంలో మిస్టిక్ రివర్ అనే సినిమాకు మరియు 2008లో మిల్క్ అనే సినిమాకు గాను రెండు సార్లు ఆస్కార్ అవార్డులను సోంతం చేసుకున్నారు. తండ్రి దర్శకత్వంలో మొట్టమొదటిసారి హాలీవుడ్ టెలివిజన్ ఛానల్ కుపరిచయమయ్యారు మన సీన్ పెన్. డెడ్ మ్యాన్ వాకింగ్ అనే సినిమా ద్వారా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లోమొట్టమొదటిసారి బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నారు.
అలా తన ప్రస్ధానాన్ని కోనసాగిస్తూ ముందుకి కోనసాగిపోయారు మన సీన్ పెన్. అంతేకాకుండా సెప్టెంబర్ 11అమెరికాలో జరిగినటువంటి దాడులకు సంబంధించి తనదైన శైలిలో ఓ బ్రహ్మాండమైన సినిమాని తీశారు. ఇటీవల కాలంలో ఈయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా దుబాయి ఫిలిం ఫెస్టివల్ లోతనకు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుని ప్రధానం చేయాలని దుబాయి ఫిలిం ఫెస్టివల్ ఛైర్మన్ అబ్దుల్ అహ్మాద్ జుమా తెలిపారు.
డిసెంబర్ 12న దుబాయిలో జరగనున్న ఈకార్యక్రమంలో సీన్ పెన్ కులైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుని ప్రధానం చేస్తామని తెలిపారు. ఈసందర్బంగా అబ్దుల్ అహ్మాద్ జుమా మాట్లాడుతూ మాయొక్క జనరేషన్ లోసీన్ పెన్ ఓ అద్బతమైన నటుడిగా అభివర్ణించారు. అంతేకాకుండా ఓ వైవిద్యమైన నటనకు శ్రీకారం చుట్టారు. సీన్ పెన్ మాకు దేవుడు గిప్ట్ గా ఇచ్చినటువంటి డైరెక్టర్ మరియు ఫిలిం ప్రోడ్యూసర్ గాభావిస్తున్నామన్నారు. దుబాయిలో జరుగుతున్నటువంటి కల్చర్ బ్రైడింగ్ కుఆయనను సాధారంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అంతేకాకుండా ముప్పయి సంవత్సారాలు హాలీవుడ్ కుఈయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈఅవార్డుని ప్రధానం చేస్తున్నాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











