»   » డ్రగ్స్‌తో పట్టుబడ్డ ప్రముఖ నటుడి అరెస్ట్.. జైలుకు తరలింపు!

డ్రగ్స్‌తో పట్టుబడ్డ ప్రముఖ నటుడి అరెస్ట్.. జైలుకు తరలింపు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
డ్రగ్స్‌తో పట్టుబడ్డ ప్రముఖ నటుడి అరెస్ట్.. జైలుకు తరలింపు!

డ్రగ్స్ కేసులో హాలీవుడ్ నటుడు హాపర్ జాక్ పెన్, అతని గర్ల్‌ఫ్రెండ్ ఉమా వాన్ విట్‌క్యాంప్‌ అరెస్ట్ అయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం వారిద్దరిని బుధవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి హామిల్టన్ కౌంటీ జైలుకు తరలించారు. నెబ్రాకా పట్టణంలో డ్రగ్స్‌తో పట్టుబడటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. హాపర్ జాక్ పెన్ ప్రముఖ హాలీవుడ్ నటులు, ఆస్కార్ అవార్డు గ్రహీత సీన్ పెన్, రాబిన్ రైట్ దంపతుల కుమారుడు కావడం గమనార్హం.

 డ్రగ్స్‌తో పట్టుబడిన నటులు

డ్రగ్స్‌తో పట్టుబడిన నటులు

హాపర్ పెన్‌ అరెస్ట్‌పై నెబ్రాక స్టేట్ పోలీసులు వివరణ ఇచ్చారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా హాపర్ పెన్ వాహనాన్ని తనిఖీ చేశాం. వాహనంలో అతడి ప్రేయసి కూడా ఉన్నారు. వారి వద్ద 14 గ్రాముల మారిజువానా, అంపెటామైన్ మాత్రలు, మూడు గ్రాముల పుట్టగొడుగులు లభించాయి అని చెప్పారు.

తీవ్రమైన నేరారోపణలతో

తీవ్రమైన నేరారోపణలతో

మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందున్న ఉమా వాన్ చట్ట నిబంధనల ప్రకారం తీవ్రమైన నేరారోపణలు నమోదు చేశాం. హాపర్ పెన్‌పై కూడా డ్రగ్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశాం అని పోలీసులు చెప్పారు.

డ్రగ్స్ నుంచి విముక్తి అయ్యానంటూ..

డ్రగ్స్ నుంచి విముక్తి అయ్యానంటూ..

డ్రగ్స్ అలవాటు నుంచి నేను విముక్తి అయ్యానని గతేడాది హాపర్ పెన్ ప్రకటన చేశాడు. డ్రగ్స్ నుంచి బయటపడటానికి తన తండ్రి సీన్ పెన్ కారణమని చెప్పారు. డ్రగ్స్ వాడక వలన నా జీవితం దారుణంగా తయారైందని ఆయన అన్నారు. కానీ మళ్లీ డగ్స్‌తో హాపర్ పెన్ పట్టుబడటం హాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

English summary
US actor Hopper Jack Penn and his girlfriend Uma Von Wittkamp were arrested Wednesday afternoon and taken to Hamilton County Jail. The son of Hollywood stars Sean Penn and Robin Wright has been arrested on drug possession charges in Nebraska. Authorities say the trooper detected drug activity inside the vehicle and found 14 grams of marijuana, four amphetamine pills and 3 grams of mushrooms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X