సూపర్ ఫన్నీ... : ఫ్యాన్స్ ని ఆటపట్టించిన స్టార్ హీరో (వీడియో)
లాస్ ఏంజిల్స్ : తమని అభిమానించే ఫ్యాన్స్ తో చాలా సరదగా మూవ్ అవుతూంటారు హీరోలు. ఈ సంస్కృతి అన్ని చోట్లా ఉంది. ఫ్యాన్సే లేకపోతే తాము లేమనే వాస్తవం వారికి తెలుసు. తమని ఎంతగానో అభిమానించే అభిమానులును అప్పుడప్పుడూ సరదాగా ఉత్సాహపరచటానికి..తమ చిత్రం ప్రమోషన్ కు హాలీవుడ్ హీరోలు రకరకాల టెక్నిక్స్ వాడుతూంటారు. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అలా చేసి నవ్వులు పండించారు. ఆయన ఏం చేసారో..ఇప్పటికీ మీరు చూడకపోతే ఇక్కడ ఓ లుక్కేయండి మరి...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
'టెర్మినేటర్' చిత్రంలో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ పాత్రను పోలిన మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. ఓ అభిమాని సరదాగా ఓ ఫొటో తీయించుకుందామని ఆ బొమ్మ దగ్గరకు వెళ్లగానే ఒక్కసారిగా కదిలింది. 'నేను నిజం'అని ఆ బొమ్మ అనగానే ఆ అభిమాని ఒక్కసారిగా కంగారు పడింది.
దాన్నుంచి తేరుకొన్నాకా అది బొమ్మ కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ అనే నిజం తెలిసింది. తెగ సంబరపడిపోయింది. ఆయనతో ఓ సెల్ఫీ తీసుకుంది. ఆ తర్వాత అదే గెటప్‌లో అక్కడి వీధుల్లో తిరిగి సందడి చేశారు ఆర్నాల్డ్. ఇదంతా ఓ పాఠశాల విద్యార్థుల కోసం చేపట్టిన ధార్మిక కార్యక్రమం కోసం చేశారు ఆర్నాల్డ్.

'టెర్మినేటర్ జెనిసిస్' విషయానికి వస్తే...
హాలీవుడ్ చరిత్రలో 'టెర్మినేటర్' చిత్రంతో ప్రత్యేక అధ్యాయం. మన దేశంలో కూడా అది చిన్న చిన్న టౌన్ లో కూడా వంద రోజులుఆడి రికార్డులు క్రియేట్ చేసింది. అప్పట్లో టెర్మనేటర్..విన్యాసాలకు ,గ్రాఫిక్స్ కు అందరూ అబ్బురు పడి చూసేవారు. అంతేకాదు...ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టిన చిత్రం అది. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు చిత్రాలూ ఘనవిజయం సాధించాయి.
ఇప్పుడు 'టెర్మినేటర్ జెనిసిస్' పేరుతో మరో సీక్వెల్ సిద్ధమవుతోంది. రీసెంట్ గా దానికి సంబంధించిన పోస్టర్‌ను హీరో ఆర్నాల్డ్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ కి విశేషాదారణ వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మంటల్లో కాలిపోతున్న ఆర్నాల్డ్ (రోబో)తో పాటు ఇతర తారాగణం ఉన్న ఆ పోస్టరు ఆసక్తి రేకెత్తిస్తోంది. అలన్ టైలర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జులై 1న విడుదల కానుంది.

‘టెర్రినేటర్ జీనిసిస్' సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల కాగా...తాజాగా సెకండ్ ట్రైలర్ విడుదల చేసారు. మొదటి ట్రలైర్ తో పాటు తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ చూస్తుంటే మరోసారి ఈ టెర్మినేటర్ ప్రపంచ సినీ అభిమానులను మెప్పించబోతున్నాడని స్పష్టమవుతోంది. 170 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో ఇంకా ఎమిలి క్లార్క్, జాసన్ క్లార్క్, జాయ్ కోర్ట్నెనీ, మాట్ స్మిత్, లీ బైంగ్, డాయో ఒకెనియి, కోర్ట్నెనీ బి.వాన్స్, సాన్‌డ్రైన్ హోల్ట్, జెకె.సిమన్స్, డగ్లస్ స్మిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డేవిడ్ ఎలిసన్, డనా గోల్డ్ బెర్గ్ నిర్మాతలు. పారామౌంట్ పిక్చర్స్ వారు ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











