వయసులో ఉన్నాం అందుకే, జస్ట్ ఫర్ ఫన్ కోసమే
జస్టిన్ బైబర్ పరిచయాలు అక్కర లేని మనిషి. ప్రపంచంలో ఉన్న ఫేమస్ టీన్ పాప్ స్టార్స్‌లలో ఒకడు. ఇటీవల కాలంలో వీరిద్దరి గురించి చెప్పాలంటే మాత్రం జస్టిన్ ప్రేమలో పీకల్లోతు మునిగి పోతున్న జంట. ఐతే వీరిద్దరి మద్య ఉన్నటువంటి రిలేషన్ షిప్ ఏమిటని సెలీనా గోమెజ్‌ని ప్రశ్నించగా అదంతా జస్ట్ ఫన్ కోసమే మేము చేస్తున్నాం అని అంటుంది. 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ టీనేజి పాప్ స్టార్‌తో హీరోయిన్ అయినటువంటి సెలీనా గోమెజ్ ఐదు నెలలు నుండి ప్రేమాయణం సాగిస్తుంది. అంతేకాకుండా ఈ వయసులో డేటింగ్ అనేది చాలా సర్వసాధారణం ఈ బంధాన్ని ఇలానే కొనసాగించాలని అనుకుంటున్నాం అని అంది.
ప్రస్తుతం నేను యంగ్. అందుకే ఇలా నేను ఫన్ చేస్తున్నానని తనని తాను సమర్దించుకుంది. జస్టిన్ బైబర్‌తో ప్రేమలో ఉన్నప్పటికీ సెలీనా మాత్రం ఈ విషయాన్ని బయటకు మాత్రం వెల్లడించడం లేదు. ఇది మాత్రమే కాకుండా ఈ బంధాన్ని వెల్లడిస్తే తన కెరియర్‌కు ఎక్కడ భంగం కలుగుతుందేమోనని భయపడుతుందని అంటున్నారు. ప్రస్తుతం సెలీనా గోమెజ్ తన బ్యాండ్ ది సెన్స్ తో కొత్తగా రూపోందిస్తున్నటువంటి మూడవ ఆల్బమ్ 'వెన్ ద సన్ గోస్ డౌన్' మీద దృష్టిని కేంద్రీకరించింది. వీటితోపాటు త్వరలో లండన్‌లో ఓ బట్టల దుకాణాన్ని కూడా ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications











