హీరోయిన్‌కి అజ్ఞాత వ్యక్తి నుండి చావు భయం
హాలీవుడ్ సింగర్, హీరోయిన్ (జస్టిన్ బైబర్ ప్రియురాలు) సెలీనా గోమెజ్ ఇటీవల తనకు ఓ వ్యక్తి వల్ల ప్రాణాపయం ఉందని తెలియడంతో బెంబేలెత్తిపోయారు. అసలు విషయంలోకి వెళితే 46 సంవత్సరాలు వయసు కలిగిన థామస్ బ్రాడ్నికీ అనే వ్యక్తి తాను దేవుడితో మాట్లాడానని దేవుడు సింగర్ సెలీనా గోమెజ్‌ని చంపమన్నాడని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ రొడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడంట.
ఈ విషయం తెలిసిన లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ మేనేజ్‌మెంట్ విభాగం ఈ విషయంపై సీరియస్‌గా విచారణ చేపట్టింది. దీంతో అతనిని మనోరోగ వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్లడం జరిగింది. అక్కడ కూడా అతను తాను దేవుడితో మాట్లాడానని సెలీనా గోమెజ్‌ని దేవుడు చంపమన్నాడని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మాట్లడాడంతో అతని జబ్బుని చాలా సీరియస్‌గా తీసుకొవడం జరిగింది.
అంతేకాకుండా గతంలో థామస్ బ్రాడ్నికీ రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తిని మెటల్ రాడ్డుతో తలపై కొట్టగా అతను కళ్లను సైతం కొల్పోవాల్సి వచ్చింది. సెలీనా గోమెజ్, ఆమె లాయర్ బ్లెయిర్ బెర్క్‌లు కూడా కొర్టుని ఆశ్రయించి అతనిపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కొరడం జరిగింది. దీంతో లాస్ ఏంజిల్స్ కొర్టు కూడా థామస్ బ్రాడ్నికీ మనోరోగంపై అధికారులు స్పందించి సరైన ట్రీట్ మెంట్ ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడమైంది.


Click it and Unblock the Notifications











