సెక్సీ సీన్లు పెట్టినా, బట్టలు విప్పినా ప్రయోజనం లేదాయె..!
ఒక సినిమా ఆడాలంటే అందులో కథ, కథనం, పాత్రల తీరుతెన్నులు, సంగీతం, నటీనటుల నటన... ఇలా ఎన్నో అంశాలు బాగుండాలి. కానీ ఇవేవీ లేకుండా సినిమాల్లో కేవలం రెచ్చగొట్టే సన్నివేశాలు పెట్టి, గుడ్డలూడదీసి ప్రేక్షకుడిలో వేడిని పెంచే సన్నివేశాలతో లాగించేద్దాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మీ సినిమాను ప్రేక్షకుడు ససేమీరా అంగీకరించడు సరికదా.. నిరభ్యంతరంగా తిప్పికొడతాడు. ఇది నేను చెబుతున్న అభిప్రాయం కాదండోయ్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది.
హాలీవుడ్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఏమాత్రం మొహమాటం లేకుండా నటీనటులు గుడ్డలూడదీయడం, వారి మధ్య చోటు చేసుకునే గరం గరం అధరచుంబనాలు, సెక్సీ సన్నివేశాలు. సినిమాలో విషయం లేకుండా కేవలం ఇలాంటి సన్నివేశాలు మాత్రమే వుంటే సినిమాను ఎవ్వరూ పట్టించుకోరు, సినిమాలో విషయం వుంటేనే ఈ సన్నివేశాలు హైలెట్ అవుతాయి. టైటానిక్ వంటి సినిమానే తీసుకుందాం ఈ సినిమా అధ్భుతమయిన ప్రేమకథను తెరమీద ఆవిశ్కరించింది కాబట్టి అందులోని న్యూడ్ సీన్లు హైలెట్ అయ్యాయి.
ఓ సినిమాను సెక్సీ సన్నివేశాలు ఎంతవరకూ ప్రభావితం చేస్తాయి అని ఇటీవల ఓ వెబ్ సైటు నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 2001 నుండీ 2005 సంవత్సరాల మధ్య విడుదలయిన సినిమాలను ప్రాతిపదికగా తీసుకొని నిర్వహించిన ఈ సర్వేలో చాలా మంది సినిమాలో విషయం లేకపోతే సెక్సీ సీన్లు ఓ మోస్తరుగా ప్రభావితం చెయ్యవచ్చు కానీ, కేవలం అవే సీన్లతో సినిమాను నెట్టుకు రావడం కుదరదని తేల్చిపారేసారు.


Click it and Unblock the Notifications











