హాట్ లేడీని ఇంకా వెంటాడుతున్న ‘సెక్స్ టేప్’
అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో ప్రపంచం చూపులను తనవైపు తిప్పుకున్న కిమ్ రెండు నెలల క్రితం బాస్కెట్ బాల్ స్టార్ హంప్రిస్ ను పెళ్లాడింది. అయితే కిమ్ ను ఇప్పటికీ ఓ సమస్య వెంటాడుతోంది. 2007లో ఇంటర్నెట్ లోకి విడుదలైన ఆమె సెక్స్ టేప్ ఇప్పటికీ ఆమెకు, ఆమె కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆ సెక్స్ టేప్ ను మళ్లీ ఇంటర్నెట్ లో విడుదల చేయడానికి సిద్ధం అవుతుండటమే ఇందుకు కారణం. తన కొత్త సంసారంలో ఈ సెక్స్ టేప్ చిచ్చు రేపుతుందేమోనని మదన పడుతోంది ఈ హాట్ లేడీ.
ఆమె తల్లి క్రిస్ జెన్నెర్ మాటల ప్రకారం....''ఈ విషయం గురించి కిమ్ నాతో చెబుతూ బాగా బాధ పడి పోయింది. అదే జరిగితే తన కాపురంలో కలతలు వస్తాయని మదన పడుతోంది. అప్పుడో జరిగిన చేదు సంఘటన ఇప్పటికీ మా కుటుంబాన్ని వెంటాడుతుండటం ఎంతో బాధగా ఉంది"" అంటూ జెన్నర్ ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొంది.


Click it and Unblock the Notifications











