అతను ఎంతో సెక్సీ, స్టయిలిష్...!!
పీపుల్స్ మ్యాగ్జయిన్ నిర్వహించిన పోల్ లో రెండు సార్లు ప్రపంచ సెక్సీయెస్ట్ మ్యాన్ గా నిలిచిన జానీ డెప్ ఈ ఏడాది ప్రథమార్థంలో మరో ఘనతను సాధించుకున్నారు. GQ మ్యాగ్జయిన్ నిర్వహించిన పోల్ లో స్టయిలిష్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా ఎంపికయ్యారు. బ్రాడ్ పిట్, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి హేమాహేమీలు ఈ పోటీలో తొలి 25 మందిలో స్థానం సంపాదించుకున్నారు.
గత ఏడాది హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా నిలిచిన జానీ డెప్ హవాయ్ దేశానికి టూరిజం, పారిశ్రామిక అభివృద్ధికై డబ్బును డొనేట్ చేసాడు. ప్రస్తుతం జానీ డెప్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమా షూటింగ్ నిమిత్తం హవాయ్ లోనే వున్నాడు. కాగా జానీ డెప్, ప్రపంచ అందగత్తె ఏంజలీనాతో జోడి కట్టిన ది టూరిస్ట్ షూటింగ్ కూడా పాల్గొననున్నాడు.
జానీ డెప్ బ్రాడ్ పిట్ హాలీవుడ్ ఏంజలీనా జోలీ సెక్సీయెస్ట్ మ్యాన్ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ పీపుల్ మ్యాగ్జయిన్ johnny depp hollywood sexiest man people magazine brad pitt angelina jolie


Click it and Unblock the Notifications