హాలీవుడ్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ కా బాద్షాగా అందరికీ సుపరిచితుడైన షారూఖ్ ఖాన్ ఓ హాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. హాలీవుడ్ లో 'ట్యాక్సీ డ్రైవర్', 'అమెరికన్ గిగోలో' వంటి చిత్రాలను తీసిన ప్రముఖ స్క్రీన్ ప్లే రైటర్ పాల్ ష్కారడర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. షారూఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం', 'బిల్లూ బార్బర్' చిత్రాలకు స్క్రీన్ ప్లే సమకూర్చిన ముస్తాక్ షేక్ మరియు అనుభవ్ సిన్హా ఈ చిత్రన్ని పది మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ లో రూపొందించబోతున్నట్టు సమాచారం.
ఇంతకు ముందు షారూఖ్ సినిమాలకు పనిచేసిన చనువుతో ముస్తాక్ షేక్ ఈ సినిమాలో నటించమని బాద్షాను కోరినట్టు తెలిసింది. 'ఎక్ట్రీమ్ సిటీ' పేరుతో రూపొందబోయే ఈ చిత్రంలో నటించడానికి షారూఖ్ కూడా సానుకూలంగా ఉన్నాడట.
షారూఖ్ ఖాన్ బాలీవుడ్ హాలీవుడ్ ఎక్ట్రీమ్ సిటీ ముస్తాక్ షేక్ అనుభవ్ సిన్హా shahrukh khan xtrme city bollywood hollywood taxi driver mushtaq shiekh anubhav sinha


Click it and Unblock the Notifications