నా బాయ్ ఫ్రెండ్ అందుకు ఒప్పుకోడు: షకీరా
లండన్: పాప్ స్టార్ షకీరా గత కొంత కాలంగా తన బాయ్ ఫ్రెండ్, ఫుట్ బాల్ ఆటగాడైన గెరార్డ్ పిక్‍తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. తాజాగా షకీరా తన బాయ్ ఫ్రెండు గురించి ఓ సంచనల వ్యాఖ్య చేసింది. వేరే మగాళ్లతో కలిసి షూటింగులో పాల్గొనేందుకు తన బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోడని ఆమె వ్యాఖ్యానించింది.
సాధారణంగా ఫుల్ బాల్ ఆటగాళ్లలో ఉండే ఈర్ష్యా స్వభావం తన బాయ్ ఫ్రెండులో కూడా ఉందని, అందుకే తాను వేరే మగాళ్లతో కలిసి షూటింగులో పాల్గొనడాన్ని అతను అంగీకరించడం లేదు అని అంటున్నారు షకీరా. ఈ కారణంగానే తాను ఎక్కువగా మహిళలతో కలిసి వీడియో ఆల్బమ్స్ చేస్తుంటానని చెప్పుకొచ్చారు.

పాప్ స్టార్ 'షకీరా' తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‍తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా 'మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. షకీరా మ్యూజిక్ ఆల్బమ్స్ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో పిక్ తన కుమారుడి బాధ్యతలను స్వయంగా దగ్గరుండి చేసుకుంటున్నాడు.
షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో జత కట్టింది. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... రెండు మూడేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్ ద్వారా గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 35 సంవత్సరాలు.


Click it and Unblock the Notifications











