'దీవి'ని కొనుగోలు చేసిన సూపర్ స్టార్..
కొలంబియన్ పాప్ సింగర్ షకీరా, మ్యుజిషియన్ రోజర్ వాటర్స్ కలసి జంటగా $16 మిలియన్ విలువ కలిగిన కరేబియన్ ఐలాండ్‌ని కొనుగోలు చేయడం జరిగింది. 34 సంవత్సరాలు వయసు కలిగిన షకీరా, 68 సంవత్సరాలు వయసు కలిగిన రోజర్ వాటర్స్ ఇద్దరూ కూడా ఐలాండ్‌లో టూరిజమ్‌ని అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో ఐలాండ్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
కరేబియన్ ఐలాండ్‌లో లగ్జరీ హాలీడే ఇళ్లతో పాటు, అందమైన ప్రవేట్ బీచ్‌లకు రూపకల్పన చేసి, ఎక్కువ మొత్తంలో హోటల్స్‌ని ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షించడానికి పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇవి మాత్రమే కాకుండా సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా బీచ్‌లో 200 స్పీడ్ బోట్‌లను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ ప్రాజెక్టుని మియామి ఆధారిత బిల్డర్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. ఈ ఐలాండ్‌లో కేవలం సెలబ్రిటీలకు, పెద్ద పెద్ద వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని సమాచారం. విహార సమయంలో సందర్శకులు సరదాగా గోల్ఫ్ ఆడేందుకు అనుకూలంగా ఇక్కడ 18 రంధ్రాలు కలగిని గోల్ప్ కోర్స్‌ని కూడా రూపొందించనట్లు తెలిపారు.
ఇది ఇలా ఉంటే కొలంబియా పాప్ సింగర్ షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్ తో తన ప్రేమాయణం ఫోటోలను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేయడం జరిగింది. మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ లో ఈ 34 ఏళ్ల పాప్ గాయని తన ప్రియుడు పిక్ తో ఒక సముద్రతీరాన చెట్టా పట్టాలేసుకుని సూర్యోదయంలో తీయించుకున్న ఫోటోని అందరికి చూపించింది. ఏడాది క్రితం ఈ కొత్త ప్రియుణ్ణి తన 'వాకా వాకా" పాట షూటింగ్ లో చూసింది. షకీరా తన పాత ప్రియుడు ఏంటోనియా డేలారువా తనని మోసం చేసాడని, 11ఏళ్ల ప్రేమకు పుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











