కలలో కూడా అలాంటి కల కనలేదంటున్న సూపర్ స్టార్
కోలంబియన్ సూపర్ స్టార్ షకీరా వాకా వాకా(దిస్ టైమ్ ఫర్ అమెరికా)అనే ట్రాక్ వీడియో షేరింగ్ వెబ్ సైట్ అయినటువంటి యూట్యూబ్‌లో వన్ బిలియన్అభిమానలు చూడడం తనకు నిజంగా చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి అత్యంత ఘనమైన రికార్డు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఉబ్బితబిబ్బు అయినటువంటి షకీరా తనకు ఈరికార్డుకి సహాకరించినటువంటి అన్‌లైన్ అభిమానులందరికి తన కృతజ్ఞతలు చెప్పారు.
ప్రపంచం మొత్తం మీద వన్ బిలియన్ మంది జనాభా నావీడియో సాంగ్‌ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది చాలా అరుదైన రికార్డు. నేను జీవితంలో కూడా ఇంత మంది జనాభా నాసాంగ్‌ని చూస్తారని కలలో కూడా కల కనలేదు తెలుసా అంటూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఇది మాత్రం నేను నాజీవితంలో విన్నటువంటి మంచి న్యూస్ అని అన్నారు. ఇలాంటి రికార్డుల్ని గతంలో సింగర్స్ లేడిగాగా, జస్టిన్ బైబర్స్ కూడా నమోదు చేయడం జరిగింది.
ఇకపోతే ఇటీవల ప్రాన్స్‌లో జరిగినటువంటి పన్నెండవ ఎన్‌ఆర్‌జె మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో కోలంబియన్ సూపర్ స్టార్ షకీరాకు ఇంటర్నేషనల్ ఫీమేల్ ఆర్టిస్ట్ అఫ్ ద ఇయర్ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా వాకా వాకా(దిస్ టైమ్ ఫర్ అమెరికా)అనే ట్రాక్‌కు గాను ఇంటర్నేషనల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా సోంతం చేసుకున్నారు. ఇకపోతే ఇంటర్నేషనల్ మేల్ ఆర్టస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకుగాను వుషర్ నామినేట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











