అదరగొడుతున్న 32 ఏళ్లు ఆంటీ -షకీరా
నడుము తిప్పడంలో ఆమెను మించిన వారెవ్వరూ లేరు. ఆమే షకీరా. ఎవరైనా బాగా చేసినా అరె అచ్చు షకీరాలా చేసిందే అంటారే కానీ ఆమెను మించిపోయింది అని మాత్రం అనలేరు. అలాంటి లాటిన్ పాప్ తార షకీరా అభిమానులకు ఓ తీపి కబురు. తన నృత్యంతో అందరినీ ఆకట్టుకున్న ఈ తార 32వ పడిలో పడినా తన శరీరాన్ని ఏ మాత్రం అదుపుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తోంది. దీని గురించి షకీరా మాట్లాడుతూ "ప్రతి ఒక్కరికీ తమ శరీరతత్వం మీద అభద్రతాభావం వుంటుంది. కానీ నాకా బాధ ఇరవై ఏళ్ల వయసులో వుండేది. కానీ అప్పుడా బాధలేదు. తన శరీరం తనకు చాలా బాగా సహకరిస్తోందని, ఇకపై మరిన్ని పాటలతో ప్రేక్షకులను అలరిస్తానని" చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం షకీరా చేసిన 'షి వూల్ఫ్' వీడియో విడుదలకు సిద్ధంగా వుంది. దీని గురించి మాట్లాడిన షకీరా ఇలాంటి వీడియో తానింక వరకూ చెయ్యలేదని, తప్పకుండా తన అభిమానులని అలరిస్తుందని చెప్పుకొచ్చింది. సో షకీరా నుండీ మనం ఇంకా మంచి వీడియోలను ఆశించవచ్చన్నమాట.


Click it and Unblock the Notifications











