మగ బిడ్డకు జన్మనిచ్చిన... పాప్ స్టార్ షకీరా
బార్సిలోనా: పాప్ స్టార్ షకీరా మగ బిడ్డకు జన్మనిచ్చింది. స్పెయిన్ లోని ఆసుపత్రిలో మంగళవారం షకీరా ప్రసవించింది. అక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో స్పెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‍తో వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. రాత్రి 9.36 గంటలకు ఆమె ప్రసవించింది. బిడ్డ 3 కేజీల బరువు ఉందని వైద్యులు తెలిపారు. అప్పుడే బిడ్డకు పేరు కూడా పెట్టేసారు. మిలన్ పిక్ మెబారక్ అని నామకరణం చేసారు.
ఈ సంతోషకర విషయాన్ని షకీరా తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. మా ప్రేమకు గుర్తుగా బిడ్డ పుట్టిన విషయాన్ని ఎంతో సంతోషంగా అనౌన్స్ చేస్తున్నాం అంటూ షకీరా పేర్కొంది. ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని షకీరా మురిసి పోతోంది. దీంతో ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీలు లక్షలాది శుభాకాంక్షలతో నిండిపోయింది. ఒక్క ఫేస్ బుక్ లోనే షకీరాకు 59 మిలియన్ల అభిమానులు ఉన్నారు.
షకీరా గత కొంత కాలంగా కాలంగా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో ఆమె డేటింగ్ చేస్తోంది. 'తమ బంధం ఎంతో రొమాంటిగా సాగుతోందని, త్వరలో నేను తల్లిని కాబోతున్నాను' అని చెబుతూ షకీరా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తన బేబీ బంప్ (గర్భం) ఫోటోలను గతంలోనే పోస్ట్ చేసింది.
షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో జత కట్టింది. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... రెండు మూడేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్ ద్వారా గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 35 సంవత్సరాలు.


Click it and Unblock the Notifications











