50 మిలియన్ ఫేస్‌బుక్ ఫ్యాన్స్‌కు చేరుకున్న పాప్ సింగర్
కొలంబియన్ పాప్ స్టార్ షకీరా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఓ సరిక్రొత్త రికార్డుని సృష్టించింది. ఫేస్‌బుక్‌లో షకీరాని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. ఈ విషయాన్ని పాప్ స్టార్ షకీరా స్వయంగా తెలియజేశారు. షకీరా తన ఫేస్‌బుక్ ఫ్రొపైల్ లో పార్టీలకు ధరించి టోపీని ధరించి.. ఒక చేతిలో బెలూన్, మరోక చేతిలో “50 మిలియన్!!!" సంఖ్యను చూచించే పోస్టర్‌ని పట్టుకున్న ఫోటోని ఫోస్ట్ చేసింది.
ఇక ఈ ఫోటో క్రింద షకీరా 'ఫేస్‌బుక్‌లో 50 మిలియన్, నమ్మశక్యం కావడం లేదు. మీ ప్రేమ అనేక ధన్యవాదాలు. ఒక పెద్ద ముద్దు' అంటూ కామెంట్ వ్రాశారు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లో ప్రపంచంలో ఎక్కువగా అభిమానులతో కనెక్ట్ అయ్యే స్టార్ లలో షకీరా ఒకరు. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో షకీరాని 16,000 ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు.
అభిమానులతో కనెక్ట్ అయ్యే లాటిన్ స్టార్స్ విభాగంలో షకీరా నామినేషన్స్ సాధించారు. మియామిలో గతనెలలో జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్‌లో 'లాటిన్ సోషల్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్' అవార్డుని సొంతం చేసుకున్నారు. పాప్ స్టార్స్ లేడిగాగా, ఓర్పా విన్ ఫ్రేల తర్వాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లలో ఎక్కువ అభిమానులను సొంతం చేసుకున్న స్టార్‌లలో షకీరా ఒకరు.


Click it and Unblock the Notifications











