పాప్ స్టార్ షకీరా కొడుకు ఫస్ట్ లుక్ ఫోటో

By Bojja Kumar

బార్సిలోనా : పాస్ స్టార్ 'షకీరా' తన ప్రియుడు గెరార్డ్ పిక్‍‌‌తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా 'మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. తాజాగా మిలన్ ఫస్ట్ లుక్ ఫోటోను షకీరా తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసింది.

బిడ్డకు జన్మనిచ్చిన రోజును షకీరా తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు అంటూ మురిసి పోతోంది. అభిమానులు ఈ జంటలను అభినందలతో ముంచెత్తుతున్నారు. ఒక్క ఫేస్ బుక్ లోనే షకీరాకు 60 మిలియన్ల అభిమానులు ఉన్నారు. షకీరా గత కొంత కాలంగా కాలంగా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍‌తో ఆమె డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍‌తో జత కట్టింది. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... రెండు మూడేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్‍ ద్వారా గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 35 సంవత్సరాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X