బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమాయణం-గర్భవతైన పాప్ స్టార్
కాలిఫోర్నియా: ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ షకీరా గర్భం దాల్చింది. గత కొంత కాలంగా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో ఆమె డేటింగ్ చేస్తోంది. 'తమ బంధం ఎంతో రొమాంటిగా సాగుతోందని, త్వరలో నేను తల్లిని కాబోతున్నాను' అని చెబుతూ షకీరా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో తన బేబీ బంప్ (గర్భం) ఫోటోలను పోస్ట్ చేసింది.
తమ అభిమాన స్టార్ తల్లి కాబోతోందనే విషయం తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపించారు. దీంతో ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీలు లక్షలాది లైక్, వేలాది కాంమెంట్స్‌తో నిండిపోయింది. ఒక్క ఫేస్ బుక్ లోనే షకీరాకు 56 మిలియన్ల అభిమానులు ఉన్నారు.
గతంలో షకీరా గతంలో యాంటోనియో డి లా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో జత కట్టింది. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... రెండు మూడేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్ ద్వారా గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 35 సంవత్సరాలు. ఇక వయసు పైబడితే అమ్మతనం అనుభవించే అవకాశాలు తక్కువ కాబట్టి ఆమె గర్భవతి కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











