twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుత్వం చేత అరుదైన గౌరవం పొందిన సింగర్

    By Nageswara Rao
    |

    సింగర్ 'షకీరా'ని ఫ్రాన్స్ ప్రభుత్వం 'చెవాలియర్ డి ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్‌డెస్ లెటర్స్ మెడల్' ఇచ్చి సన్మానించారు. దీంతో ఈ అవార్డు పొందిన మొదటి కొలంబియన్‌ షకీరానే కావడం విశేషం. 34 సంవత్సరాల వయసు కలిగిన షకీరాకు ఈ అవార్డుని శనివారం కేన్స్ ఉత్సవంలో ప్రెంచ్ సాంస్కృతిక శాక మంత్రి 'ఫ్రెడెరిక్ మిట్టరాండ్ల' తన చేతుల మీదగా అందజేశారు.

    ఈ అవార్డు స్పీకరించిన సందర్బంలో షీకీరా మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వానికి మారుపేరైన ఫ్రాన్స్ దేశంలో ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో నా భాద్యత మరింత పెరిగిందని చెబుతూ.. ప్రపంచంలో మిగిలి ఉన్న దేశాలకు ఈ సంస్కృతిని తెలిసేలా చేస్తానని తన అధికారిక వెబ్‌సైట్‌లో ద్వారా తెలిపారు.

    ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డుని కళలు మరియు సాహిత్యంతో పాటుగా ఇతర స్వీకర్తలకు ముఖ్యమైన రచనలు వ్రాసిన వారిని గుర్తించి వారికి అందజేస్తుంది. గతంలో ఈ అవార్డుని ఎలియట్, జార్జ్ క్లూనీ మరియు క్లింట్ ఈస్ట్ వుడ్ మొదలగున వారు పొందారు.

    English summary
    Singer Shakira has become the first Colombian to be honoured with France’s Chevalier De L’Ordre des Arts et des Lettres medal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X