Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాయ్ ఫ్రెండుతో షకీరా ఆనందహేల.. (ఫోటోలు)
లాస్ ఏంజిల్స్ : పాప్ స్టార్ 'షకీరా' తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‍తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా 'మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు.
బిడ్డపుట్టినప్పటి నుంచి షకీరా ఎంతో సంతోషంగా ఉందని, గతంలో కంటే ఆమెలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా తొనికిసలాడుతోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అంతే కాదు బాయ్ ఫ్రెండ్ గెరాల్డ్ పిక్‌తో కలిసి విహార యాత్రలతో తెగ ఎంజాయ్ చేస్తూ గడుపుతోంది.
షకీరా మ్యూజిక్ ఆల్బమ్స్ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో పిక్ తన కుమారుడి బాధ్యతలను స్వయంగా దగ్గరుండి చేసుకుంటున్నాడు....
మిగతా వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి విహార యాత్రలో..
షకీరా, గెరాల్డ్ పిక్ విహార యాత్రలో మనిగి తేలారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు అయిన గెరార్డ్ పిక్‍తో షకీరా డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

మిలన్ పిక్ మెబారక్
షకీరా తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‍తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా ‘మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు.

షకీరా గురించిన వివరాలు
షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍తో జత కట్టింది. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... రెండు మూడేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్ ద్వారా గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 35 సంవత్సరాలు.

షకీరా అభిమానులు
ప్రపంచ వ్యాప్తంగా షకీరా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకుంది. ఆమెకు ఒక్క ఫేస్ బుక్ లోనే 68 మిలియన్ల అభిమానులు ఉన్నారు. సోషల్ నెట్వర్కింగులో ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉంటూ వారికి తన గురించి, తన ఆల్బమ్స్ గురించిన విషయాలు పాలు పంచుకుంటూ ఉంటుంది.

షకీరాకు ఫెంచి గౌరవం
సింగర్ 'షకీరా'ని ఫ్రాన్స్ ప్రభుత్వం 'చెవాలియర్ డి ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్‌డెస్ లెటర్స్ మెడల్' ఇచ్చి సన్మానించారు. దీంతో ఈ అవార్డు పొందిన మొదటి కొలంబియన్ షకీరానే కావడం విశేషం. ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డుని కళలు మరియు సాహిత్యంతో పాటుగా ఇతర స్వీకర్తలకు ముఖ్యమైన రచనలు వ్రాసిన వారిని గుర్తించి వారికి అందజేస్తుంది. గతంలో ఈ అవార్డుని ఎలియట్, జార్జ్ క్లూనీ మరియు క్లింట్ ఈస్ట్ వుడ్ మొదలగున వారు పొందారు.